Breaking News

విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడమే విజయ దీపం లక్ష్యం…

-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటితరం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి సుజనా ఫౌండేషన్, క్రిస్ప్ సంస్థలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సుజన ఫౌండేషన్ మరియు క్రిస్ప్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విశ్రాంత ఐఏఎస్ లు అంగన్వాడీలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో గురువారం ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో విజయ దీపం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ దీపం కార్యక్రమం కింద చేపట్టే కార్యక్రమాల బ్రోచర్ను అతిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నుద్దేశించి శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ పది మంది విశ్రాంత ఐఏఎస్ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీ లు, పాఠశాలల్లోని బాల బాలికలు, టీచర్లు, అందరి అవసరాలకు అనుగుణంగా సరికొత్త విద్యా విధానానికి రూప కల్పన చేశారన్నారు. విద్యార్థుల శక్తి, సామర్ధ్యాలను వెలికి తీసి వారికి ఇష్టమైన రంగాల్లో, రాణించేలా ప్రోత్సహించడం తద్వారా వారి జీవన జీవన నైపుణ్యాలను మెరుగుపరిచి వారికి ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సుజాన ఫౌండేషన్, క్రిస్ప్ సంస్థలు కృషి చేస్తాయన్నారు. విజయవాడ వెస్ట్ ను బెస్ట్ గా తీర్చి దిద్దరం తన లక్ష్యమన్నారు..ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న విజయ దీపం కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. ఈ విజయ దీపం కార్యక్రమం ద్వారా ప్రైమరీ పాఠశాల, హై స్కూల్ విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించి వారిలోని ప్రతిభా పాటవాలను గుర్తించి వారికి ఇష్టమైన రంగంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనె ధ్యేయంగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారికి ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకునేలా ప్రోత్సహించడం, వ్యాపార అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ పదేళ్ల పాలనలో 35 కోట్ల మంది పేదలు దారిద్ర్య రేఖ నుంచి బయటికి వచ్చారన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ప్రజలు అనేక చోట్ల దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సేవల కృషి తో పాటూ ప్రజల సహకారం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించొచ్చు అన్నారు. సమిష్టిగా విజయ దీపం కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో, దేశంలో పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
అనంతరం ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ , క్రిస్ప్ సంస్థలు స్వచ్ఛందంగా చేస్తున్న సేవలు అభినందనీయం అని కొనియాడారు. ప్రధాని మోడీ దేశ ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఎంతో కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. సమాజాభివృద్ధికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి మరువలేనిది అన్నారు. పౌష్టిక ఆహార లోపం వలన శిశువుల మరణాలు జరుగుతున్నాయని అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ పిల్లల్లో మానసిక ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ ద్వారా శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, అంగనవాడి సెంటర్ల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలోసుజనా ఫౌండేషన్ సీఈవో పివి రావ్ , సుజనా ఫౌండేషన్ సలహాదారు వి శ్రీనివాసరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు క్రిస్ప్ ఫౌండర్ కన్నెగంటి సంధ్యారాణి, వేణుగోపాల్ రెడ్డి, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, టిడిపి నేత నాగుల్ మీరా, జనసేన నేత అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు….

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *