-చిడిపి గ్రామం లో భూ సమస్యలకు పరిష్కారానికి గ్రామ సభ
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
చిడిపి గ్రామంలో రీ సర్వే లో వచ్చిన భూసమస్యలకు త్వరితగతిన పరిష్కారించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యు గ్రామ సభలో కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎటువంటి భూ సమస్యలు అయినా పరిష్కరించే విధంగా రెవెన్యు గ్రామ సభలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ సభలో రైతుల యొక్క భూ సమస్యలను అడిగి వాటికి త్వరితగతిన పరిష్కరించే విధంగా రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎటు వంటి భూ సమస్యలు రాకుండా చూసు కోవాలని మండల తాహసిల్దార్ గ్రామ రెవెన్యు అధికారి, గ్రామ సర్వేయర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చిడిపి గ్రామ సభలో 18 ఆర్జిలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, మండల తాహసిల్దార్ యం. ప్రసాద్, పాలడుగుల లక్ష్మ ణరావు, వీఆర్వో బంగారు బాబు, గ్రామ సర్వేయర్ ఎ. ప్రసాద్, చిడిపి స్ధానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.