Breaking News

పోతేపల్లిలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, ఎంటర్ ప్రెన్యూర్స్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) జిల్లా పరిశ్రమల శాఖ సహకారంతో ఎం ఎస్ ఎం ఈ క్లస్టర్ ఔట్రీచ్ ప్రోగ్రాం శుక్రవారం బందరు మండలం పోతేపల్లిలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ లో నిర్వహించారు. ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్ ఎంటర్ప్రైన్యూర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్స్ తలుచుకుంటే ఒక దేశం తలరాత మార్చగలరని, టెక్నాలజీ అప్ గ్రేడ్ కాకుండా ఏ పరిశ్రమ మనుగడ సాగించలేదని అన్నారు. మచిలీపట్నం ఇమిటేషన్ జ్యుయలరీ ప్రత్యేకమైనదని, దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎంటర్ప్రైన్యూస్ ఒక్కొక్కరుగా కంటే క్లస్టర్ గా ఏర్పాటై, కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టినప్పుడు టెక్నాలజీని సంయుక్తంగా వినియోగించుకుని అభివృద్ధి చెందుతారని అన్నారు. పెడన కలంకారి, రైస్ మిల్లర్స్ క్లస్టర్ గా ఏర్పాటు కావాలని కలెక్టర్ సూచిస్తూ, ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

సిడ్బి జనరల్ మేనేజర్ వి. చంద్రమౌళి మాట్లాడుతూ ఎం ఎస్ ఎం ఈ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు, మన దేశం జిడిపిలో 30 శాతం ఎం ఎస్ ఎం ఈ ద్వారానే లభిస్తోందన్నారు. మచిలీపట్నంలో త్వరలో సిడ్బి బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ ప్రెసిడెంట్ పి.వి.సుబ్బారావు మాట్లాడుతూ ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నారని, త్వరలో sidbi బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఇమిటేషన్ జ్యువెలరీ కామన్ ఫెసిలిటీ సెంటర్ లో స్కిల్ హబ్ సందర్శించి, శిక్షణ పొందుతున్న వారితో కలెక్టర్ మాట్లాడి, శిక్షణ ఎలా పొందుతున్నారు, ఈ శిక్షణ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు, ఇమిటేషన్ జ్యువెలరీ ఎస్ పి వి క్లస్టర్ డైరెక్టర్ ప్రసాద్ రావు, రైస్ మిల్లర్స్, పెడన కలంకారి ఎంటర్ప్రైన్యూర్స్ పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *