Breaking News

చట్టరీత్యా స్కానింగ్ కేంద్రాల ను తప్పనిసరిగా నమోదు చేయాలి 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం ను పటిష్టంగా అమలు చేయుట జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని శ్రీమతి జి గీతాబాయి గారు తెలిపినారు. మచిలీపట్నం లోని సాయి జస్విక మెటర్నటీ హాస్పిటల్ లో స్కాన్ సెంటర్ కేంద్రమును పర్మిషన్ నిమిత్తము సందర్శించినారు. అలాగే రెన్యువల్ నిమిత్తం ఆంధ్ర హాస్పటల్ లోని స్కాన్ సెంటర్ ను సందర్శించినారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా పిసిపిఎన్డిటి చట్టం పరిధిలో నమోదు చేయవలసినదిగా తెలియజేసినారు. ఎవరైనా లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసినారు . అవసరమైతే ఐఎంఏ గుర్తింపును కూడా రద్దు చేయడం జరుగుతుందని, ముఖ్యంగా జిల్లాలో తక్కువ లింగ నిష్పత్తి గల ప్రాంతాలను గుర్తించి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ప్రజలలో అవగాహన కల్పించటం జరుగుతుందని తెలియజేసినారు . స్కానింగ్ కేంద్రాలకు సంబంధించిన అనుమతులన్నీ కచ్చితంగా ఉండాలని తెలియజేసినారు. స్కానింగ్ కేంద్రాల వారు తమ కేంద్రాలకు వచ్చిన గర్భవతులు యొక్క పూర్తి వివరాలను మరియు అనుమతిని తీసుకొని మాత్రమే స్కానింగ్ నిర్వహించవలెనని తెలియజేసినారు . ప్రతి గర్భవతి యొక్క వివరాలను ఫారం -F అప్లికేషను ద్వారా ఆన్లైన్ చేయవలెను అని తెలియజేసినారు , ముఖ్యంగా గర్భవతులు మరియు వారి సంబంధీకులు స్కానింగ్ కేంద్రాలకు వెళ్లి ఆడ , మగ అని తెలుసుకోరాదని తెలియజేసినారు . లింగ నిర్ధారణ చేయుచున్న వారి సమాచారం తెలిపినచో వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచి ఆయా కేంద్రాలపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసినారు . అలాగే
కమిషనర్ , రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ , ప్రభుత్వ o వారి ఆదేశానుసారం జిల్లాలో ఉన్న వైద్యశాల లు , నర్సింగ్ హోమ్స్ , పాలి క్లినిక్స్ , డెంటల్ క్లినిక్స్ , లాబోరేటరీలు , ఫిజియోథెరపీ క్లినిక్స్ , తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వైద్య మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం -2002 పరిధిలో నమోదు చేయవలసినదిగా కోరినారు . పై తెలిపిన సంస్థల వారందరూ తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ . ఏపీ. జి ఓ వి .ఇన్ లో ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేయవలసిందిగా కోరినారు . అలా నమోదు చేయకుండా ఏర్పాటు చేసినటువంటి సంస్థలపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యా బోధకుడు బి. రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *