తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల అక్టోబర్ 18 నుండి 20 వరకు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొనుటకు నేటి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం కు విచ్చేసిన జాతీయ సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ కి జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య మరియు ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి తదితరులు సాదర స్వాగతం పలికారు.
జాతీయ సఫాయి కరంచారి కమిషన్, న్యూ ఢిల్లీ చైర్మన్ ఎం.వెంకటేశన్ ఈ నెల అక్టోబర్ 18 నుండి 20 వరకు తిరుపతి జిల్లా మరియు చిత్తూరు జిల్లాలో ‘ది ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్, 2013’ అమలును సమీక్షించడానికి మరియు పలు కార్యక్రమాలలో పాల్గొనటానికి నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం కు విచ్చేసిన అనంతరం చిత్తూరు జిల్లాకు రోడ్డు మార్గాన చేరుకుని పలు కార్యక్రమాలలో పాల్గోని తిరిగి రాత్రి 8.00 గం.లకు తిరుపతికి విచ్చేసి రాత్రి బస చేసి, రేపు అనగా 19 వ తేది ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మరియు సెక్రటరీతో పాటు సంబంధిత సఫాయి కరంచారి నాయకులు మరియు పారిశుధ్య కార్మికులతో సమావేశం తుడా మీటింగ్ హాల్ నందు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు డీన్ మరియు మెడికల్ సూపరింటెండెంట్, శ్రీ వెంకటేశ్వర రాంనారాయణ్ రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – (RUIA హాస్పిటల్) మరియు ఇతర సీనియర్ అధికారులతో పాటు సఫాయి కరంచారిల నాయకులు మరియు పారిశుధ్య కార్మికులతో సమావేశం రుయా హాస్పిటల్ మీటింగ్ హాల్ నందు నిర్వహిస్తారని, సాయంత్రం 5 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) మరియు హాస్పిటల్ డైరెక్టర్-కమ్-వైస్ ఛాన్సలర్, మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఇతర సీనియర్ అధికారులతో పాటు సంబంధిత అధికారులు మరియు సఫాయి కరంచారిల నాయకులతో సమావేశం స్విమ్స్ మీటింగ్ హాల్ నందు నిర్వహిస్తారని, అనంతరం అదే రోజు రాత్రి తిరుపతి నందు బస చేస్తారని, మరుసటి దినం అనగా 20వ తేదీన ఉదయం 9.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి వారు ఢిల్లీ కి తిరుగు ప్రయాణం కానున్నారు.