-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అక్టోబర్ 22,2024 న పునమిఘాట్, బబ్బురి గ్రౌండ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న డ్రోన్ సమ్మట్లో జరగబోవు డ్రోన్ షో ఏర్పాట్లను పరిశీలించారు. కృష్ణానది తీరంలో డ్రోన్ షో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని, ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. ఘట్ల వద్ద ఉన్న రైలింగ్ లను సరి చూసుకోవాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు, మొక్కలు నాటే అవకాశం ఉన్న ప్రదేశాలలో మొక్కలను నాటి హరితాన్ని పెంచాలని హార్టికల్చర్ విభాగాన్ని ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి సత్యనారాయణ, జాయింట్ డైరెక్టర్ అమృత్ మరియు పి ఓ యూ సి డి ఇంచార్జ్ డాక్టర్ లత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎస్ఎన్ ప్రసాద్,ఇంజనీరింగ్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.