Breaking News

ల్యాబ్ టెక్నీషియన్ల సంక్షేమ బాధ్యత ప్రభుత్వంపై ఉంది

-తూర్పుగోదావరి డయాగ్నోకాన్ -2024 కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-రోగ నిర్ధారణ కేంద్రాల్లో ఉన్నతమైన సేవలు అందిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర కీలకమైందన్న మంత్రి దుర్గేష్
-ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని వెల్లడి
-ల్యాబ్ టెక్నీషియన్లకు సామాజిక భద్రత కల్పన.. సామాజిక బీమాలో భాగస్వామ్యులను చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి దుర్గేష్
-కీలకమైన సమయంలో సమావేశం ఏర్పాటు చేసినందుకు రాజమండ్రి ల్యాబ్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులను అభినందించిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆరోగ్యాన్ని డాక్టర్లు ఎంత స్థాయిలో కాపాడుతారో అదే స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్లు కాపాడుతున్నారని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం లోని హోటల్ షెల్టన్ లో రాజమండ్రి ల్యాబ్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా ల్యాబ్ టెక్నీషియన్స్ నాలెడ్జ్ కాన్ఫరెన్స్ కు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. తూర్పుగోదావరి జిల్లా డయాగ్నోకాన్-2024 సమావేశం సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్స్ తమ సమస్యలను మంత్రి దుర్గేష్ కి విన్నవించారు.. ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలపై మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ల సంక్షేమ బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడెక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేయాల్సిన పూర్తి బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ఇప్పటివరకు జరిగిన ఇబ్బందులను అధిగమిస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎలాంటి రిక్రూట్మెంట్ జరగకపోవడం శోచనీయమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము మెగా డీఎస్సీ పేరిట ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నామన్నారు. అదే విధంగా ల్యాబ్ టెక్నీషియన్లు పోస్టుల భర్తీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు..

ల్యాబ్ టెక్నీషియన్లకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు సామాజిక బీమా ఏర్పాటు చేసే బాధ్యత తమపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.. అంతేగాక ల్యాబ్ టెక్నీషియన్లను బీమాలో భాగస్వాములను చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.. ల్యాబ్ టెక్నీషియన్లు కోరినట్టుగా కనీస సౌకర్యమైన ఆఫీస్ లేదా స్థలం ఏర్పాటుకు ఆలోచిస్తామన్నారు.కీలకమైన సమయంలో కీలకమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు సంబంధిత నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు..

ఆధునిక వైద్యంలో ల్యాబ్ టెక్నీషియన్లది కీలక పాత్ర
ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత రోగ నిర్ధారణ కోసం వైద్యులు ల్యాబ్ టెక్నీషియన్స్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. వైద్య రంగం మొత్తం ల్యాబ్ టెక్నీషియన్ల మీద ఆధారపడే సందర్భం నెలకొందన్నారు.. రోగికి సంబంధించి వైద్య పరీక్షలు మొదలు ఎమ్మారై స్కాన్, ఇతరత్రా సేవలకు ల్యాబ్ టెక్నీషియన్ అవసరం తప్పనిసరి అన్నారు. ఒక వ్యక్తి తాలూకూ రోగాన్ని నిర్ధారించాలన్నా, మందు ఇవ్వాలన్నా, ఏ చికిత్స విధానం అవలంబించాలన్నా రోగికి, డాక్టర్ కు మధ్య ఉండే ల్యాబ్ టెక్నీషియన్ పాత్ర కీలకమైంది అన్నారు.. ప్రస్తుత కాలంలో ల్యాబ్ టెక్నీషియన్ల ప్రాతినిధ్యం పెరిగిన నేపథ్యంలో సంబంధిత వృత్తిపై ఆధారపడి బతికే వారి సంఖ్య కూడా పెరిగిందని మంత్రి వివరించారు.. ఈ నేపథ్యంలో ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ లతోపాటు అధికారులు ఇతర నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *