-సమస్యలు అధికంగా ఉన్నా హామీల అమలులో కూటమి ప్రభుత్వం ముందుంటుంది
-బాధ్యత వహించి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి
-ఈ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టభద్రుల ఓటర్ల జాబితా రూపొందించాలి
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ (టౌన్/చందర్లపాడు), నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి పాలనతో ఆంధ్ర ప్రదేశ్ కు శుభ ఘడియలు ప్రారంభమయ్యాయి అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఆదివారం నాడు చందర్లపాడు మండలం, నందిగామ రూరల్ టౌన్ క్లస్టర్ యూనిట్ పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో విడివిడిగా సమావేశమయ్యారు. నాయకులు అందరూ బాధ్యత వహించి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ఈ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టభద్రుల ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు. నమోదు సమయం తక్కువ ఉన్నందున పట్టభద్రుల ఓట్ల నమోదు వేగవంతం చేయాలని కోరారు. గతంలో ఓటువేసుకున్నా మరలా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి బూత్ లు వారీగా తిరిగి పట్టభద్రులను గుర్తించి ఆఫ్ లైన్లో గాని ఆన్లైన్లో గాని ఓటు నమోదు చేయించాలన్నారు. ఓటు నమోదు ప్రక్రియ విజయ వంతం చేసుకోగలిగితే గెలుపు అంత సులువుగా ఉంటుందన్నారు. ఓటు నమోదు చేయించడం ఎంత ముఖ్యమో, వారిని ఆ తేదీ, ఆ సమయంలో ఓటు వేసుకునేలా చూడవలసిన బాధ్యత అంతే ముఖ్యం అన్నారు.