Breaking News

విజయనగరం జిల్లా గొర్లలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ

-ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే అసలు ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్ తో మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని సిఎం నిర్ణయించారు. మరణాలకు అసలు కారణం ఏంటి, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏంటి అనేది తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని సిఎం భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని….సమస్య పరిష్కారం అయ్యేవరకు తాగునీరు సరఫరా చేయాలని సిఎం ఆదేశించారు. వైద్య శిబిరాలు కొనసాగించాలని సిఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్లుఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ధైర్యం చెప్పి…..సమస్య పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా ఉండాలని సిఎం అధికారులను సూచించారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *