అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ వారు సోమవారం రాష్ట్రము లోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమైన 3 అంశములపై సమీక్ష జరిపి ,తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానముగా
1) ఈ పంట వివరములు – రేపటినుండి భౌతిక మరియు డిజిటల్ రసీదులు పంపిణీ
2) కేంద్రం నూతనముగా ప్రవేశ పెట్టిన జాతీయ పురుగు/తెగుళ్ల నిఘా వ్యవస్థ – NPSS పై ఆవిష్కరించిన ఆప్ APP పై అవగాహనను
3) నమో డ్రోన్ దీదీ పథకం పై వివిధ డ్రోన్ సరఫరాదారులు , వ్యవసాయ ఉ న్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు.
ముందుగా ఈ పంట పై మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ పంట లోని వివిధ దశలు అయిన పంటల సాగు వివరముల నమోదు ,వాటిపై వివిధ స్థాయి ఉన్నతాది కారుల సూపర్ చెక్ పునఃపరిశీలన ,సామాజిక తనిఖీ ,ఫిర్యాదుల స్వీకరణ & పరిస్కరణ ముగించుకున్న దరమిల రేపటినుండి అనగా 22/10//24 నుండి రైతులకు వారి ఈ పంట నమోదు వివరములను భౌతిక రసీదుల రూపములోనూ మరియు వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు సంక్షిప్త సమాచారం SMS ద్వారా డిజిటల్ రసీదులను పంపిణీ ప్రారంభించాలని , పంపిణీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు .
రెండవ అంశముగా భారత ప్రభుత్వం నూతనముగా ప్రవేశపెట్టిన జాతీయ పురుగు/తెగుళ్ల నిఘా వ్యవస్థ – NPSS లోని ఆప్ APP వినియోగంపై శ్రీమతి విజయభారతి , సస్యరక్షణ,జాయింట్ డైరెక్టర్ గారు ఆప్ వినియోగ విధానం ,ఉపయోగాలు వాటిపై అవగాహన కల్పించారు .ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానం ను ఉపయోగించుకుని ఈ వ్యవస్థ పని చేస్తుంది అని డిల్లీ రావు గారు తెలిపారు.
వీటిపై జిల్లా అధికారులు స్పందిస్తూ ,జిల్లా స్థాయిలో అవగాహన, శిక్షణ ఇవ్వాలని కోరారు
మూడవ అంశముగ కేంద్ర ప్రభుత్వ నమో డ్రోన్ దీది పథకం ద్వారా రాష్ట్రములో డ్రోన్లు సరఫరా చేసిన పంపిణీ దారులు ,శాస్త్ర వేత్తలు & వ్యవసాయ ఉన్నతాది కారులతో డ్రోన్ పథక క్షేత్ర స్థాయిలో అమలు ,సమస్యలు ,తదుపరి చెబట్టవలసిన చర్యలపై సమీక్షించారు .
Tags amaravathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …