-ధార్మక సంస్థలకు ధారపోసిన 70 శాతం సంపాదన
-ధూమ,మద్యపాన వ్యాపారానికి దూరం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒకవ్యాపారవేత్త మరణిస్తే దేశం మొత్తం కన్నీళ్లు పెట్టడం అసాధారణం.మహోన్నుత వ్యక్తిత్వంగల రతన్ టాటా మరణం భరతమాత కన్నీరు పెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. చివరివరకూ దేశభక్తి ఊపిరిగా,తాను సంపాదించిన ఆదాయంలో 70 శాతం ప్రజాశ్రేయస్సూ కు ఖర్చుపెట్టిన మహామనిషి రతన్ టాటా.వీలునామాలో కూడా వారసులకు 30 శాతం మాత్రమే ఇచ్చి మిగిలినది ట్రస్ట్ కు రాసిన వితరణశీలి.సాధారణంగా సామాన్యుల్లో అసామాన్యుడు అని అంటాం.కాని రతన్ టాటా అసామాన్యుల్లో సామాన్యుడిగా బతికి చూపించాడు. “కృషితోనాస్తి దుర్భిక్షం” ఆనేదాన్ని నమ్మి వ్యాపారవేత్తగా,సామాజికవేత్తగా,దానశీలిగా ప్రసిద్ధి కెక్కాడు.వ్యాపారవేత్తగా జిరో వ్యతిరేకత ఉన్న ఏకైక వ్యక్తి.చివరి సందేశంలో కూడా నేను ఆరోగ్యంగానే ఉన్నానని పుకార్లునమ్మవద్దని చెప్పడం ఆయన ధైర్యానికి నివాళి. గోల్డెన్ స్పూన్ తో పుట్టినా సామాన్యుడిగా, బ్రహ్మ చారిగా జీవించారు.ఆయన లక్జరీక్లాస్ లో ప్రయాణం చేసే అవకాశం ఉన్నా విమానాల్లో ఎప్పుడూ ఏకానమీ క్లాస్లో మాత్రమే వెళ్లిన కష్టజీవి. వ్యాపారం లాభసాటి మాత్రమే కాదు విలువలతో ఉండాలని నమ్మి చివరివరకూ ఆచరించిన ఆదర్శవాది.యువకులకూ, యువ పారిశ్రామిక వేత్తలకు ఆయన ఒక దార్శనికుడు.ప్రజలకు మంచి చెయ్యని ధూమ,మద్యపానంవ్యాపారం మినహా రతన్ టాటా కంపెనీ చేయని వ్యాపారంలేదు. ఇంగ్లండ్ రాజు ఇచ్చే సన్మానం,బిరుదు వదులుకుని మూగజీవాల కోసం ఆస్పత్రి నిర్మించి సందర్శించిన కారుణ్యజీవి.జంతుప్రేమికుడైనరతన్ వీధి కుక్కలకోసం బోంబాయిలో వందలకోట్లు ఖరీదు చేసే ఫ్లాట్ ను కేటాయించారు.వంశపారంగాసంక్రమిచ్చిన వ్యాపారాన్ని దేశ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేర్చగలిగారు. తాజ్ మహల్ హోటల్ పై ఉగ్రదాడి అనంతరం రీమోడలింగ్ కు పాకిస్తాన్ వ్యాపారవేత్తలు టెండర్ వేయగా “నేను సిగ్గు లేనివాడను కాన”ని తిరస్కరించడం ఆయన దేశభక్తికి నిదర్శనం.ఆయన పూర్వీకులు పర్షియా నుంచి భారత్ వచ్చి వ్యాపారసామ్రాజ్రాన్ని స్థాపించి,దేశాభివృద్ధికి దోహదంచేస్తూ,ఇదే తన దేశమని మనసా,కర్మణా నమ్మి ప్రజలమనస్సులలోకి చొచ్చుకుని వెళ్లేలా చేసిన రతన్ టాటా నిజంగా భారతరత్నమే.1937లో డిసెంబర్ 19న రతన్ నావెల్ టాటా బొంబాయి లో జన్మించారు.ఆయనకు జిమ్మి అనే తమ్ముడు ఉన్నాడు.
తల్లిదండ్రులు విడిపోవడంతో నానమ్మ వీరిని పెంచింది.బొంబాయిలో చదివి,అమెరికాలో అర్కిటెక్చర్ పూర్తిచేశారు.నానమ్మకు ఆరోగ్యం సరిగాలేదని తెలియడంతో బొంబాయి తిరిగి వచ్చాడు. 1962లో కంపెనీలో క్రింద స్థాయినుంచి పనిచేసి టాటాగ్రూప్ చైర్మన్ స్థాయికి 1991లో ఎదిగాడు. అప్పటినుంచి వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరించి ప్రపంచంలోనే ప్రముఖ దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత రతన్ టాటాకే దక్కింది. 2012లో చైర్మన్ పదవిని విరమణ అయ్యేవరకూ ఆయన అన్నిరంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. సామాన్యుడి నుంచి సంపన్నులైన వారిఇంట్లో టాటా కంపెనీవస్తువు ఉండితీరుతుందంటే అది ఆయన కృషిఫలితమే. అటోమోబైల్స్,టాటా కార్స్, టాటాస్టీల్,టీసీఎస్ రంగాల్లో ఆయన పట్టిందల్లా బంగారమయ్యింది.
ఆయన కలల ప్రాజెక్ట్ నానో కారుతయారీ చేపట్టారు. కారు తయారుచేసి సామాన్యుడికి ధర అందుబాటులో ఉండేలా చేయ్యాలని రతన్ టాటా లక్ష్యంగా ప్రాజెక్ట్ చేపట్టి నానో కారును మార్కెట్ లో వదిలారు.
వ్యాపారంలో పాటు దాతృత్వంలో ఆయనకు ఆయనే సాటి. ట్రస్ట్ ఏర్పాటు చేసి సంపదలో అధికభాగం ధార్మిక సంస్థలకు వితరణ చేసారు. అన్నీ ఉన్నా ఏమీ లేనివాడులా సామాన్యంగా బతికిన ఆయన చేతివాచీ కేవలం 10వేలు మాత్రమే అంటే ఆశ్చర్యం కలగక మానదు.రతన్ టాటా తల్లిదండ్రులు నావెల్ టాటా,సోనీ టాటా.1940లో వారు విడిపోయిన తరువాత నావల్ టాటా సిమోన్ ను పెండ్లి చేసుకున్నాడు.వారికి నోయల్ టాటా జన్నించాడు.నోయల్ కు ముగ్గురు సంతానం.వారే ఇప్పుడు టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసులు.సూరత్ కు చెందిన విమల్ భాయ్ అనే వజ్రాల వ్యాపారి స్వతహా చిత్రకారుడు కావడంతో రతన్ టాటా మీద అభిమానంతో 11వేల వజ్రాలతో ఆయన చిత్రపటాన్ని చేసాడు.2004లో రతన్ టాటా “ఏత్బార్” అనే హిందీ చిత్రాన్ని నిర్మించారు.అమితాబ్ దీనిలో నటించారు. ఆయన వ్యాపారసామ్రాజ్యం ఆరులక్షలకోట్లతో ఏడులక్షల ఉద్యోగులతో విస్తరించిఉంది.ఆయన భగ్న
ప్రేమికుడని,అందుకే బ్రహ్మచారిగా ఉండిపోయారని సమాచారం.దాదాపుగా 100 దేశాల్లో టాటా సంస్థలు పనిచేస్తున్నాయంటే దానివెనుక కృషి రతన్ టాటాదే.చదువు తరువాత ఐబీఎంలో అవకాశం వచ్చినా మామ జేఆర్డీ సలహాతో టాటా సంస్థలో చిన్న ఉద్యోగంలో చేరి చైర్మన్ స్థాయికి చేరాడు. 1991లో మామ జేఆర్డీ టాటా తరువాత టాటాగ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రతన్ టాటా వారసుడిగా నోయల్ టాటా ఎన్నికయ్యాడు. 2018లో రతన్ టాటా కు అసిస్టెంట్ గా ట్రస్ట్ మేనేజర్ గా శంతన్ నాయుడు చేరాడు.చివరి దశలో రతన్ కు శంతన్ అండగా ఉన్నాడు.వీరిద్దరికీ వీధికుక్కలపై ప్రేమ కలిపింది. రతన్ కార్లమీద ఎంతప్రేమ ఉందో వీధికుక్కలపై కూడా అంతే ప్రేమ ఉండేది.కరోనా సమయంలో రూ.1500 కోట్లు సహాయం చేసిన గొప్ప మానవతావాది.ఏదిఏమైనా ఇంతటిమానవాతావాది,విలువలున్న వ్యాపారవేత్తను ఇకపై చూడలేం.భారతీయుడిగా ఇలాంటి వ్యక్తి పుట్టడం మన అదృష్టం భావించాలి.