-శాసన సభ్యులు బొండా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం సాయంత్రం గాంధీనగర్ కౌతాపూర్ణానదం కళావేదికపై విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిదిగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు, టి డి పి పోలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్ర రావు మాట్లాడుతూ అమర గాయకుడు ఘంటసాల 25 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలని, తెలుగు జాతిని జాగృత పరిచిన నందముూరి తారక రామారావు, ఘంటసాల లకు ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని, హైదరాబాద్ టాంక్ బండ్ మాదిరి కృష్ణానదికి ఇరువైపుల మహనీయుల విగ్రహాలు నెలకొల్పాలని కళాకారులుగా మీ కోరిక సమంజసమేనని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కళ్లను, కళాకారులను అభిమానించే మంచి మనసున్న వ్యక్తి అంటూ మీకోరికలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నెరవేర్చే విదంగా కృషిచేస్తాను అని శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. సంస్థ అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి తమ ఆశయాలను వివరించారు. తెలుగు కళావాహిని అధ్యక్షులు చింతకాయల చిట్చిబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభలో తెలుగుదేశం సీనియర్ నాయకులు నవనీతం సాంబశివరావు, కె డేవిడ్ రాజు, శ్రీ కళాభారతి అధ్యక్షులు శింగంశెచ్టి చంద్రశేఖర్, ఎక్స్ రే బోడి ఆంజనేయ రాజు, కారుమంచి రాజు, జి రంగారెడ్డి, కె వి ప్రసాద్, ముస్టి శ్రీనివాస్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంగీత విభావరి ఆహుతులను అలరించింది.