-బుడమేరు ముంపు లో విశేష సేవలు చేసిన పారిశుద్ధ్య కార్మికులకు ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని
జి. కోటేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర కి మెమోరండం అందజేసిన నగర ఏఐటీయూసీ నాయకులు .ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తూ ఇటీవల వచ్చిన బుడమేరు ముంపు వలన మన నగరంలోని 32 డివిజన్లు జలదిగ్బంధమయ్యాయి అనే విషయం మీకు తెలిసినదే. రాష్ట్ర ప్రభుత్వము నష్టపోయిన వీధివిక్రయదారులను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం జరిగింది. గతంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నంలోని నష్టపోయిన తోపుడుబండ్లతో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని. అదేవిధంగా నేడు విజయవాడ నగరంలో బుడమేరు ముంపు వలన నష్టపోయిన చిరు వ్యాపారులు తమ తోపుడు బళ్ళు కోల్పోయారు పళ్ళు, పువ్వులు, కూరగాయలు, పచ్చి సరుకు, మరియు ఇతర వస్తువులు కోల్పోయారు.వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ ద్వారా నష్టపరిహారం ఇవ్వాలని కోరడమైనది. అలాగే బుడిమేరు ముంపులో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని కమిషనర్ ధ్యానచంద్ర ని కోరటం అయినది. మెమోరండం అందజేసిన వారిలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష , కార్యదర్శులు కే.ఆర్.ఆంజనేయులు, మూలి.సాంబశివరావు ,వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు.వెంకటేశ్వరరావు, నాయకులు సిహెచ్ఎల్వీపీ మారుతీ రావు, ఎక్కిలి కృష్ణ, కుమార్, భీమారావు, మల్లేశ్వరి, దివ్య, ఏ ఐ వై ఎఫ్ నగర నాయకులు లంకె సాయి ఉన్నారు.