విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య వినియోగదారులకు అండగా, ఆసరాగా మేమున్నామని చెప్పే ప్రచార రథాన్ని న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్బిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఒ తరుణ్ కాకాని ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల న్యాయ స్థానం న్యాయమూర్తి మాధవరావు, డీసీపీ మేరీ ప్రశాంతి తో కలిసి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం తరుణ్ కాకాని ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాధవరావు మాట్లాడుతూ ఇది ప్రచార రథమే కాదని వినియోగదారులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సలహాలు సూచనలు ఈ అసరా సంస్థ వద్ద పొందవచ్చని చెప్పారు. ఎంతో చైతన్యవంతులైన సంస్థ సభ్యులు వినియోగదారుల హక్కుల పై పోరాడుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మీ చైతన్య రథం పనిచేస్తుందన్నారు. వినియోగదారులకు పోలీస్ సహకారం కూడా చక్కగా అందుతుందని, ఇచ్చిన తీర్పులను అమలు చేయడంలో పోలీసుల కృషి ఎంతో ఉంటుందన్నారు. ఆస్రా సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అనంతరం జిల్లా ఆస్రా సంస్థ అధ్యక్షులు తరుణ్ కాకాని మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ మొబైల్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వినియోగదారులు ఎవరైనా తమ సమస్యలపై సంప్రదిస్తే వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్రా చీఫ్ ప్యాట్రన్ సుల్తానా అలీ, ఆస్రా జాతీయ అధ్యక్షులు రత్న రాజు, రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా …