విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో ఏలూరి సాయి శరత్ సత్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి సాయి శరత్ మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ నిత్యం అవినీతి పైన పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ముందుకు సాగుతున్న తీరు , ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తిగా పోతిన వెంకట మహేష్ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గం నుండి వారి గెలుపు కోసం యువత మొత్తం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిళ్ళ శ్రీను, శనివారపు శివ, కాపు వడ్డీ, సయ్యద్ మొహిద్దిన్, భావి శెట్టి శ్రీను, షఫీ, షేక్ అబ్దుల్, లంకలపల్లి అశోక,చేన్నం శెట్టి వికాస్, అడప హరీష్ తదితరులు పాల్గొన్నారు
