విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటని ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ పేర్కొన్నారు. కత్తి మహేష్ అంటే దళితులకు పీడీతులకు అండని ఆయన చరిత్ర పట్ల కచ్చితమైన అవగాహన కలిగి ఉన్నారని అన్నారు. కత్తి మహేష్ కుటీల బ్రహ్మణ వాదాన్ని నిరసించారని అన్నారు. చరిత్రను వక్రీకరణను విమర్శించారని అది హిందు మతోన్మాదులకు శరాఘాతంగా తగిలిందని అన్నారు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ధైర్యం, సాహసం కత్తి మహేష్ సోత్తని అన్నారు. చరిత్రను ఆకళింపు చేసుకోని ధైర్యంగా చెప్పిన కత్తి ఎంతోమందికి మార్గదర్శంగా నిలచారని అన్నారు. ఓక దళితుడకు రాష్ట్ర ప్రభుత్వం సహయం చేస్తె ఓర్వని కుటీల నాయకులు ఉన్నారని దుయ్యబట్టారు. కత్తి మహేష్ భౌతికంగా మన మధ్య లేక పోయిన ఆయన ఆలోచనకు మరణం లేదని అన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలో తొలిరోజు 23 రెవిన్యూ సదస్సులు నిర్వహించాం
-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతుల, ప్రజల భూసమస్య ల నిర్ణీత కాలంలో …