విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధించి పూజించే గోమాతను బక్రీద్ సందర్భంగా హత్యచేయకుండా ప్రత్యమ్నాయం చూసుకునేలా ముస్లిం సోదరులకు సూచించాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కి శ్రీ ఆది శంకరాచార్య గో సేవా ట్రస్ట్ చైర్మన్ పుల్లేటికుర్తి కామేశ్వర రావు మరియు ధర్మో రక్షతి రక్షితః ఫౌండేషన్ అధ్యక్షుడు బూసిం వైవి సత్యనారాయణ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. శనివారం హోం మంత్రి ని గుంటూరు లోని వారి స్వగృహంలో కలిసారు. ఈ సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్య గో సేవా ట్రస్ట్ చైర్మన్ పి.ఎం.ఆర్ కామేశ్వరరావు హిందువులకు అతి ముఖ్యమైన, పవిత్రమైన గోమాతను విడిచిపెట్టాలని , గోమాతను చంపకుండా, ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేసి గోమాతను రక్షించి హిందూ ముస్లింల ఐక్యతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ విధంగా ముస్లిం మత పెద్దలు సహకరించాలని కామేశ్వర రావు కోరారు. హిందువుల మనోభావాలను ముస్లిం సోదరులు గౌరవించి బక్రీద్ కు గోవులను బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించేలా హోమ్ శాఖామంత్రి సూచించాలని కోరినట్లు తెలిపారు. గో సంరక్షణ చట్టం 1977 ప్రకారం గో వధ చేయడం నేరం కనుక ఏ సందర్భంలోను వాటిని వధించ కూడదని మంత్రి కి వివరించినట్లు తెలిపారు. అక్రమ గో రవాణా జరుగకుండా పోలీసులు సహకరించేలా రాష్ట్రంలో అన్ని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. బక్రీద్ సందర్భంగా అక్రమంగా గోవులను తరలిస్తున్నా, గో వధ జరుగుతున్న, పౌరులు అందరూ దాన్ని అడ్డుకుని పోలీసు వారికి రిపోర్ట్ చేసే చట్టం ఉన్నందున ఎక్కడయినా గోవుకు అపకారం జరుగుతున్నప్పుడు పోలీసులు ప్రజలకు సహకరించేలా ఆదేశాలివ్వాలని హోంశాఖ మంత్రి సూచరిత ని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సూచరిత సావధానంగా విని తగిన విధంగా సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని శ్రీ ఆదిశంకరాచర్య గో సేవా ట్రస్ట్ చైర్మన్ పుల్లేటికుర్తి కామేశ్వర రావు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. హోమ్ మంత్రి ని కలిసి వారిలో ప్రయాగ కృష్ణ, బాజల్ గురుస్వామి, చిత్రపు శ్యామ్ సుదర్శన్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి సూచరిత కి ధన్యవాదాలు తెలిపారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …