విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా చివరి రోజు అనగా 21/10/2024 తేదీన ఉదయం, పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో మధ్యాహ్నం పేపర్-2బి ప్రత్యేక విద్య విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 11877 మందికి గాను 9844 మంది అభ్యర్థులు అనగా 82.88 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 38 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 9441 మందికి గాను 7886 మంది అనగా 83.53 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 17 సెంటర్లలో జరిగిన పేపర్-2బి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 2436 మందికి గాను 1958 మంది అనగా 80.38 శాతం మంది హాజరయ్యారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర, పేపర్-2బి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాథమిక కీ 23-10-2024 నుండి వెబ్సైటులో అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక కీ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలను 25-10-2024 వరకు టెట్ వెబ్సైటు (https://aptet.apcfss.in/ ) ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. పదిహేడు రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్ర, జిలా స్థాయి అధికారులు, విద్యుత్, రవాణా, వైద్య, పొలీసు విభాగాల అధికారులు, సాంకేతిక బృందం సమన్వయంతో పనిచేసి టెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం.వి. కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …