Breaking News

చేబ్రోలులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్

ఏలూరు/ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం రైతాంగానికి రూ. 1674 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టడమే కాకుండా రాష్ట్రం మీద రూ. 11 లక్షల కోట్లు అప్పులు చేసిందని, జిల్లా ఇన్ చార్జి మంత్రి , రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవాకేంద్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేసినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి సహకారంతో బ్యాంకులను సంప్రదించి నెల రోజుల్లో రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించామన్నారు. రైస్ మిల్లు యాజమాన్యం తేమ శాతం ఎక్కువ అని సాకులు చెప్తూ, మిల్లర్లు ర్యాండమైజేషన్ పేరుతో వారికి కావాల్సిన మిల్లుకు ధాన్యాన్ని తరలించేలా చేయటంతో రైతులు అవస్థలు పడ్డారన్నారు. ప్రస్తుతం రైతులు తాము ఏ మిల్లుకు ధాన్యం తరలించాలనేది వారే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అలాగే రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ రైతులు ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కి అప్పగించిన 48 గంటల్లోనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకున్నామని, ఇది ఒక గొప్ప పరిణామమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 960 కోట్ల రైస్ మిల్లర్లకు బకాయిలు పెట్టి వారిని కూడా ఇబ్బందులు పాలు చేసిందన్నారు. గోనెసంచులు, రవాణా ఖర్చులు, ప్రభుత్వం భరించి రైతుల అకౌంట్లో జమ చేస్తుందన్నారు. కల్లాల వద్ద ధాన్యం ఆరబెట్టెందుకు 50% సబ్సిడీతో రైతులకు టార్ఫాలిన్లు అందిస్తున్నామన్నారు. ఇదే రైతు సహాయక కేంద్రాలు గత ప్రభుత్వంలో రూ. 3, 300 కోట్లు ఖర్చు పెట్టారని, అయితే ఏ కౌలు రైతుకైనా దీని వల్ల ఉపయోగం జరిగిందా అని ప్రశ్నించారు. కౌలు రైతు కోసం ఈ పంట నమోదులో ఎవరైతే సాగు చేస్తున్నారో అతను ఈ-పంటలో నమోదు చేసుకుని రైతు సేవాకేంద్రంలో అమ్మకం చేసేలా కూటమి ప్రభుత్వం తొలిసారిగా చర్యలు తీసుకుందన్నారు. ఆదర్శిరైతులు రైస్ మిల్లర్లతోటి సమన్వయకమిటీ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బంధీకా , పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

కార్యక్రమానికి ముందు చేబ్రోలు రైతు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్ ను మంత్రి సందర్శించారు.

కార్యక్రమంలో ఏలూరు ఆర్డిఓ అచ్యత అంబరీష్, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్. రాజు, మైక్రోఇరిగేషన్ పివో ఎ. రవికుమార్, గ్రామ సర్చంచ్ రాధేలక్ష్మిసునీత, డిప్యూటీ కలెక్టర్ కమలాదేవి, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *