-వరదల సమయంలో డ్రోన్ల వినియోగం సరికొత్త విప్లవం..
-1996లోనే విజన్-2020 దిశగా ఆలోచించిన దార్శనికుడు చంద్రబాబు..
-సమైక్యాంధ్రలో చంద్రబాబు చర్యల వల్లే వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్..
-సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీ..
-రాబోయే 20 ఏళ్లలో 200కు పైగా విమానాశ్రయాలు..
-కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి.. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరి సి.కె. కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజనరీ డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని.. ప్రపంచ డ్రోన్ హబ్ గా ఏపీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ వరదల సమయంలో డ్రోన్ల వినియోగంతో అత్యవసర సేవలు అందించడం సరికొత్త విప్లవమని తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని.. దేశవ్యాప్తంగా అందరూ నేడు అమరావతి వైపే చూస్తున్నారన్నారు.
ఏపీలో తొలిసారిగా డ్రోన్ సమ్మిట్-2024
ఢిల్లీ తర్వాత అమరావతిలోనే డ్రోన్ సమ్మిట్-2024 నిర్వహించడం జరుగుతోంది. రెండ్రోజులపాటు నిర్వహించే డ్రోన్ సమ్మిట్ ను గ్రాండ్ ప్రారంభించడమే గాక దేశానికే అమరావతిని డ్రోన్ కేపిటల్ గా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఏపీకి ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1996 లోనే సీఎం చంద్రబాబు విజన్-2020 తీసుకొచ్చారు. ఇప్పుడు డ్రోన్ల సద్వినియోగంలోనూ అదే దూరదృష్టితో ముందుకెళ్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ భావితరాల భవిష్యత్ గురించే ఆలోచిస్తారు.
చంద్రబాబు నిర్ణయాల వల్లే వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్
సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీగా ఆవిర్భవించింది. చంద్రబాబు యువతరానికి ఒక మార్గదర్శి అయితే నాకు ఒక మెంటర్‌గా ఉన్నారు. 36 ఏళ్లకే నన్ను కేంద్ర కేబినెట్‌కి పంపించారు. యువతని ప్రోత్సహించడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారనేందుకు ఇదే ఒక మంచి ఉదాహరణ. 1996లో చంద్రబాబు హైదరాబాద్ గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు అదే జీల్‌తో డ్రోన్ గురించి మాట్లాడుతున్నారు.
20 ఏళ్లలో 200కు పైగా విమాశ్రయాలు
అదేవిధంగా దేశాభివృద్ధికోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ప్రధాని మోదీ. ఏ దేశం వెళ్లినా భారత్ గురించి, మోదీ పాలనలో సాధించిన డెవలప్ గురించి మాట్లాడుతున్నారు. పదేళ్ల క్రితం 74గా ఉన్న ఎయిర్ పోర్టుల సంఖ్యను 150కి పైగా పెంచారు. రాబోయే 20 ఏళ్లలో 200కు పైగా విమాశ్రయాలు వస్తాయి. ప్రయాణికుల సంఖ్యను బట్టి ఎయిర్‌పోర్టులు, విమానాలు పెంచుతాం. డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసింది. డ్రోన్ స్టార్టప్‌లను, యువత పాత్రను కేంద్రం ప్రోత్సహిస్తోంది.
చంద్రబాబు చొరవ వల్లే డ్రోన్ సమ్మిట్
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో డ్రోన్ల టెక్నాలజీ పెరిగింది. నేడు ఎకనమిక్, ఫిజికల్ స్థితిగతులను డ్రోన్స్ మారుస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర కీలక రంగాల్లో ఇప్పటికే మార్పులు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబు చొరవతోనే అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. సరికొత్త సాంకేతికతను వాడుకోవడం గురించి సీఎం నిత్యం చర్చలు జరుపుతుంటారు. తాను కేంద్రమంత్రి అయ్యాక చాలామంది ముఖ్యమంత్రులు ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారు. కానీ ఎయిర్‌పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్‌ల ప్రాధాన్యం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.
ఏపీలో బెస్ట్ పాలసీ
డ్రోన్‌లో వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తేవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే.. డ్రోన్ టెక్నాలజీ నిపుణులు ముందుకు రావాలని.. ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. డ్రోన్ దీదీ ప్రోగ్రాం ద్వారా దేశంలో మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అందరితో మాట్లాడి పాలసీ రూపొందిస్తోందని.. కాబట్టి బెస్ట్ పాలసీ అవుతుంది కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.