-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో ఉన్న మీటింగ్ హాల్లో రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి కోసం విజయవాడ నగరపాలక సంస్థ వారు వరద ప్రభావితం కాని ప్రాంతాలలో గల ఖాళీ స్థలాల, ఆస్తి మరియు ఇతర పన్నుల అంశాలపై చర్చించారు నూతన భవనాలు, ఫ్లోర్లు, ఏమేమి ఉన్నాయో రెవెన్యూ అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు చూసుకోవాలని అన్నారు. నీటి పన్ను అంశంపై రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ ) జి సృజన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీ సామ్రాజ్యం , అసిస్టెంట్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.