Breaking News

వైద్యులు ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం బాధ్యతగా అందించాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల పనితీరు మెరుగుపడాలి… హెచ్చరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

డక్కిలి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్యులు ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం బాధ్యతగా అందించాలనీ, డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల పనితీరు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు.

బుధవారం మధ్యాహ్నం డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ముందుగా హాజరు పట్టికను పరిశీలించి సిబ్బంది 14 మంది ఉండాల్సి ఉండగా వైద్యాధికారిణి సెలవులో ఉన్న అంశంపై ఆరా తీశారు. పిహెచ్సి వైద్యాధికారి కలెక్టర్ కు వివరిస్తూ సరాసరి 100 మంది రోగుల ఓపి ఉంటుందని తెలపగా వివరాలను పరిశీలించారు. అనంతరం ఈ- ఔషధీ ఫార్మసీని పరిశీలించి అందుబాటులో ఉన్న మందుల ఎక్స్పైరీ వివరాలను, స్టాక్ వివరాలను కంప్యూటర్ నందు వివరాలను పరిశీలించారు. అలాగే రక్త పరీక్షల లేబరేటరీను పరిశీలించి తగిన రీ – ఏజెంట్లు ఉన్నాయా అని టెస్టింగ్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఆరా తీసి బీపీ మీటర్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే పిహెచ్సి లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నోటీస్ బోర్డ్ పై ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. డెలివరీ వార్డును కలెక్టర్ పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి డాక్టర్ మరియు హెల్త్ సూపర్వైజర్ ను హెచ్చరిస్తూ పనితీరు మెరుగుపడాలని ఆస్పత్రులలో గర్భిణీల డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, పది రోజులలో ప్రసవం అయ్యే గర్భిణీల వివరాలు రికార్డును పరిశీలించారు. పిహెచ్సి పరిధిలోని గర్భిణీల ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రులలో కాకుండా పిహెచ్సిలో ప్రసవాలు జరిగే విధంగా ఆసుపత్రిలో ఉన్న మెరుగైన సదుపాయాలను వినియోగించుకుని, శుచి శుభ్రత కొనసాగించి, నాణ్యమైన సేవలు పేదలకు అందించాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు వైద్యంపై పెడుతోందని మంచి సదుపాయాలు కల్పిస్తోందని, పేద రోగులకు అండగా నాణ్యమైన వైద్య సేవలు బాధ్యతగా అందించాలని సూచించారు. సంక్రాంతి నాటికి సదరు పిహెచ్సి లో 10 డెలివరీలు సక్రమంగా జరిగేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ శ్రీహరి ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *