Breaking News

సహకార చట్ట పరిధిలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సహకార పరపతి సంఘా నికి ఈనెల 28 వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఎన్నికలకు సంబదించి శిక్షణా కార్యక్రమo కలక్టరేట్లో జిల్లా సహకార అధికారిణి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. లక్ష్మి మాట్లాడుతూ సహకార చట్ట పరిధిలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాగభూషణం ఎన్నికలకు సంబదించిన నియమ నిబధనలను విపులముగా వివరించారు. ఎన్నికల అధికారి యం ఉమాపతి మాట్లాడుతూ ఎన్నికలు తిరుమల యఎస్ వి హై స్కూలు మరియి తిరుపతిలోని గోవింద రాజ స్వామి హై స్కూలు నందు జరుగునని వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ మద్దిపట్ల వెంకటరమణ , సహకార సిబ్బంది మరియు పీ వో లు, ఏ పీ వోలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *