Breaking News

బాలాయ పల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-మండల తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
-పిజిఆర్ఎస్ అర్జీలను అర్థవంతంగా నాణ్యతగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మండల తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పిజిఆర్ఎస్) అర్జీలను అర్థవంతంగా నాణ్యతగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

బుధవారం మధ్యాహ్నం బాలాయపల్లి మండల తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి సదరు కార్యాలయంలో పలు విభాగాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో రికార్డులను భద్రపరిచే గదిని పరిశీలించి వర్షాలకు రికార్డులు తడవకుండా మరమ్మత్తులు చేపట్టి రికార్డుల భద్రతకు చర్యలు చేపట్టాలని డీటీ శిరీషను ఆదేశించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎప్పటికప్పుడు అందే ఫిర్యాదులను సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలని, రెవెన్యూ సంబంధిత అర్జీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు బాధ్యతగా చర్యలు తీసుకుని పరిష్కరించాలని సూచించారు. భూముల మ్యుటేషన్ నిబంధనల మేరకు చేపట్టాలని తెలిపారు. అలాగే తాసిల్దార్ భవనం పెచ్చులూడి శిథిలావస్థలో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వేరొక భవనంలోకి మారాలని తెలిపారు.అలాగే ఫ్రీ హోల్డ్ చేసిన భూములకు సంబంధించి ఏవైనా పొరపాట్లు దొర్లి ఉంటే సవరించి నివేదికలు పంపాలని ఆదేశించారు. మండల తాసిల్దార్ పీజిఆర్ఎస్ ఫిర్యాదుల నిమిత్తం హస్తకావేరి గ్రామం నందు ఉన్నారని తెలుసుకున్న కలెక్టర్ సదరు గ్రామానికి చేరుకుని అర్జీదారులతో సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు తెలుసుకుని పరిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బాలాయపల్లి తాసిల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *