Breaking News

రాష్ట్రంలో పెట్టుబడులకు కొరియా సంస్థల ఆసక్తి

-మంత్రి నారా లోకేష్ ను కలిసిన కొరియన్ ఎక్సిమ్(KEXIM) బ్యాంక్ ప్రతినిధులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యున్ తో పాటు కొరియన్ ఎక్సిమ్(KEXIM) బ్యాంక్ ఈడీసీఎఫ్ ఆపరేషన్స్ డిపార్ట్ మెంట్-2 డైరెక్టర్ జనరల్ కెవిన్ చోయ్, కెక్సిమ్ బ్యాంక్ ఎన్డీఆర్వో ముఖ్య ప్రతినిధి జంగ్ వాన్ రియూ, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(KOICA) డైరెక్టర్ చాంగ్ వూ చాన్ బుధవారం సచివాలయంలో మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు కెక్సిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించామన్నారు. ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *