రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రోజు ఇసుక రిచ్ ల నుంచి కనీసం వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుకను త్రవ్వకం చేసేలా బోట్స్ మ్యాన్ సొసైటి లకు లక్ష్యాలను నిర్దేశించి, ఇసుకను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వినియోగదారునికి సక్రమంగా ఇసుకను అందుబాటులో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే డిసిల్టేషన్ పాయింట్స్ ను బోట్స్ మ్యాన్ సొసైటి లకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. చిన్న రీచేస్ నుంచి 1000 మెట్రీక్ టన్నులు, పెద్ద రేచేస్ నుంచి 2500 నుంచి 3 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రతి రోజు అందుబాటులో ఉంచేలా త్రవ్వకాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే తొలి దఫాలో 44 బోట్స్ మ్యాన్ సొసైటి లకు అనుమతులు ఇవ్వగా, రెండు దశలో మరో 74 సొసైటి లకి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. కొత్తగా గుర్తించిన 74 బోట్స్ మ్యాన్ సొసైటి లకి రిచ్ ల కేటాయింపు జరపాలన్నారు. జిల్లాలో గుర్తించినా 17 ఓపెన్ రీచ్ లలో నీటి నిలువలు ఉండడం వల్ల ఇంకా కార్యకలాపాలు ప్రారంభం కాలేదని, వాటిలో 16 ఒపెన్ రీచ్ లకి డి ఎల్ ఎస్ సి అనుమతులు జారీ చేశామని అధికారులు తెలిపారు. అవి అందుబాటులోకి వస్తే 11 లక్షల 88 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులోనికి , రానున్న రెండు మూడు రోజుల్లో వాటి ద్వారా కార్యకలాపాలు నిర్వహించడం తో పాటు ఇసుక రీచ్ స్థాయి కి అనుగుణంగా త్రవ్వకాల కోసం లక్ష్యం నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది డి సిల్టేషన్ పాయింట్స్ వాడపల్లి, ఔరంగబాద్ , ఔరంగబాద్-2 , ఏరినమ్మ , కొవ్వూరు , దొండగుంట రేవు, ధవళేశ్వరం రెండు పాయింట్స్, రాజమహేంద్రవరం అర్బన్ (కోటిలింగాల రేవు) లలో ఇసుక అందుబాటులొ ఉందని పేర్కొన్నారు. ఆయా రీచ్ పాయింట్స్ సమీపంలోని సచివాలయం ద్వారా ఆఫ్ లైన్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆయా సచివాలయంలో జారీ చేసే పర్మిట్ పత్రాలు, ట్రక్కు షీట్ అనుసరించి, రీచ్ లలోకి అనుమతించ నున్నట్లు కలక్టర్ పేర్కొన్నారు. ఏ రీచ్ ఏ సచివాలయం కు అనుసంధానం చేయ్యడం జరిగిందో ప్రముఖంగా ప్రదర్శించాలన్నారు. సీజ్ చేసిన, ఇసుక నిలవ ఉంచిన పాయింట్స్ లో అందుబాటులొ ఉండే ఇసుకను ఆఫ్ లైన్ విధానంలో ప్రభుత్వ పనులకు జరిపే కేటాయింపు లకి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. వినియోగదారుడికి ఎటువంటి ఆటంకం లేకుండా ఆన్లైన్ లో సరఫరా పై దృష్టి పెట్టాల్సి ఉందని, సాంకేతిక పరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
ప్రభుత్వ ప్రాధాన్యత ఇచ్చే ఇళ్ళ నిర్మాణం కోసం, పంచాయతీ రాజ్, ఆర్ఎంసి., ఆర్ అండ్ బి, విద్యుత్తు తదితర శాఖలకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉంచాల్సి ఉంటుందన్నారు. హౌసింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇళ్ళ నిర్మాణాలు పనులకి, విద్యుత్, త్రాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఆర్డీవో లు ప్రత్యేక పర్యవేక్షణా చేపట్టాలని ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లర్ల బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుందని మిల్లర్ల కు తెలియ చేయాలన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో బ్యాంకు గ్యారంటీ జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ కు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కోరడం జరిగింది.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో జి నరసింహులు, ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్, రాణి సుస్మిత, మైన్స్ ఏడి డి. ఫణి భూషణ్ రెడ్డి, ఎస్ ఈ ఇరిగేషన్ జి. శ్రీనివాస రావు, జిల్లా రవాణా అధికారి ఆర్ . సురేష్, ఎస్ ఈ విద్యుత్ కె. తిలక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.