అస్సాగో ఇండస్ట్రీ సమస్య పరిష్కారం కోసం ” సమస్య పరిష్కార కమిటీ”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అస్సాగో ఇండస్ట్రీ సమస్య పరిష్కారం కోసం ” సమస్య పరిష్కార కమిటీ” ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో పరిశ్రమలు, పర్యావరణ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గుమ్మళ్ళ దొడ్డి – అస్సాగో ఇథనాయిల్ ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పన్నం అయిన సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ సారించి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతోందనీ పేర్కొన్నారు. ఇందు కోసం సమన్వయ శాఖల అధికారులు, గ్రామస్తులు, అస్సాగో పరిశ్రమ ప్రతినిధులతో కూడి

“సమస్య పరిష్కార కమిటీ” ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారుల కమిటి లో రెవిన్యూ , పరిశ్రమ లు, పర్యావరణ. తదితర శాఖల అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. కమిటి సభ్యులు పరిశ్రమలో కాలుష్య ప్రభావం, స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు, గ్రామస్తులు పేర్కొన్న అభ్యంతరాలు పై అధ్యయనం చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. గురువారం అధికారులతో కూడిన బృందం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో రాజమండ్రీ ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్ , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎమ్ బి ఎస్ శంకర రావు , ఇండస్ట్రీస్ ప్రమోషనల్ అధికారి ప్రదీప్ కుమార్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *