Breaking News

20 ల‌క్ష‌ల ఉద్యోగ క‌ల్ప‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ ధ్యేయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-డాక్ట‌ర్ బి.ఆర్. అంబేడ్క‌ర్ స్టడీ స‌ర్కిల్ ప్రారంభోత్స‌వం
-స్కిల్ డెవ‌ల‌ప్ సెంట‌ర్స్ ఏర్పాటు కృషి

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగుల‌కి ఉద్యోగ క‌ల్ప‌నే ద్యేయంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఆయ‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప‌టోఈ ప‌రీక్ష‌ల‌కు ఉచితంగా శిక్ష‌ణ ఇచ్చేందుకు డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం.. నిరుద్యోగ యువతి, యువకులకు ఈ స్టడీ సర్కిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా” బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్ ను గురువారం ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్రారంభించారు. ఈ కార్య‌క్రమానికి హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రిబ్బ‌న్ క‌ట్ చేసి స్ట‌డీ స‌ర్కిల్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కూలికపూడి శ్రీనివాస్ రావుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు… తిరువూరు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నాలుగు లేదా ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తాన‌న్నారు.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ స్టడీస్ సర్కిల్ ని ఉపయోగించమని పోటీ పరీక్షలకు స‌న్న‌ద్దం కావాల‌ని సూచించారు.

ఇక ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ ఈ స్టడీ సర్కిల్ ద్వారా తిరువూరు నియోజకవర్గ నిరుద్యోగులతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగులు అందరూ ఉద్యోగాలు వచ్చేవరకు ఉచిత శిక్షణ పొంద‌వ‌చ్చున‌న్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మ‌డి కృష్ణ‌-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు చిట్టాబత్తిన శ్రీనివాసరావు (చిట్టిబాబు) , తిరువూరు మండ‌ల పార్టీ ప్రెసిడెంట్ వెంక‌ట న‌ర్సారెడ్డి, ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *