-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనధికార ఆక్రమణలను తొలగించేందుకు ప్రతి ఒక్క సెక్రటరీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలని, మున్సిపల్ మరియు ప్రభుత్వ స్థలాలను సంరక్షించుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో, నూతన భవనం లో గల సమావేశంలో ప్లానింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం లో అన్నారు. అనధికార ఆక్రమణలను అడ్డుకోవాలని కమిషనర్ అన్నారు. అనధికార బ్యానర్లు, హోర్డింగ్ లు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలని, అధికార ఓటింగ్లకు ఖచ్చితంగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ చూసుకోవాలని. అనధికార ఆక్రమణలు, అనధికార కట్టడాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని కమిషనర్ అన్నారు. సెక్రటరీ సిబ్బంది అందరూ ఒకరితో ఒకరు సమన్వయంతో పని చేయాలని, సచివాలయం పరిధిలో ఉన్న ఏ సమస్య అయినా సమన్వయంతో త్వరగా పరిష్కరించగలరని అన్నారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్,డిసిపి చంద్రబోస్, ఏసీపీ మోహన్ బాబు, ప్లానింగ్ సిబ్బంది, సచివాలయం ప్లానింగ్ సెక్రటరీలు, పాల్గొన్నారు.