Breaking News

నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మెషిన్ 2.0 అమలుపై సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ 2.0 అంశంపై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ కుల్దీప్ నారాయణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ అర్బన్ లవ్లీ హుడ్ మిషన్ 2.0 ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 క్యాటగిరి లో ఉన్న కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు ఋణ సదుపాయం కల్పించేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా విజయవాడ, విశాఖపట్నం ను ఎంపిక చేయగా వాటిని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ డైరెక్టర్ కుల్దీప్ నారాయణ సమీక్షించారు. నేషనల్ అర్బన్ లైవ్లి హుడ్ మెషిన్ 2.0 అమలు కొరకు నవంబర్ 1 నుండి పైలెట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్లైన కన్స్ట్రక్షన్, డొమెస్టిక్, ట్రాన్స్పోర్ట్, కేర్, వేస్ట్ వర్కర్లతో మొత్తం 150 గ్రూపులతో సిద్ధంగా ఉన్నందుకు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ కుల్దీప్ నారాయణ్ అభినందించారు.

ఈ పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా అర్హత కలిగిన లబ్ధిదారులకు కేంద్ర సంక్షేమ పథకాలు అందించటం, సెల్ సెల్ గ్రూప్స్, కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, ఏర్పాటు చేయటం, ఈ గ్రూపులు తయారుచేసిన వస్తువులను మేళ ద్వారా ఎగ్జిబిషన్లో ద్వారా వాళ్లను ప్రోత్సహించటం, కేర్ క్లస్టర్స్,డే కేర్ సెంటర్స్, షెల్టర్స్, ఇలాంటివి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవటమే ఈ పైలెట్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.  ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, అడిషనల్ మిషన్ డైరెక్టర్ కేఎన్ వెంకటేశ్వరరావు, స్టేట్ మిషన్ మేనేజర్లు ఆర్. ఆదినారాయణ, వి. ప్రభావతి, జి. రంగాచార్యులు, ఎన్. ఎన్. ఆర్. శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ అమృత్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి ఇంచార్జ్ డాక్టర్ లత, టెక్నికల్ ఎక్స్పర్ట్లు ఫణి కుమార్, శేఖర్, శ్యామల, సుజాత, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *