Breaking News

నాలుగవ రోజు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొత్తం 15 లక్షల నగదు బహుమతితో బి.యన్.కె.యు. 1వ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024 లో నాలుగవ రోజున ఎనిమిదో రౌండు పోటీలను విజయవాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అజీజ్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం ఎం పని కుమార్, సంయుక్త కార్యదర్శి మందుల రాజీవ్, రోటరీ క్లబ్ మిడ్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ నండూరి త్రినాథ్, ఐకాన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రాజేంద్ర తదితరులు మొదటి ఎత్తు ప్రారంభించారు.

మూడు దేశాల నుండి క్లాసికల్ ఓపెన్ విభాగంలో 500 మంది పైగా క్రీడాకారులు మంది పైగా క్రీడాకారులు పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని , పోటీలకు సంబంధించిన అన్ని సదుపాయాలు బాగా జరుగుతున్నాయని విజయవాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అజీజ్ తెలిపారు. క్రీడాకారులకు ఉపయోగపడే ఇలాంటి టోర్నమెంట్లను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించడానికి కావలసిన చర్యలు దిశగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ కృషి చేస్తోందని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ఎం ఫణి కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్వాలాముఖి, సంయుక్త కార్యదర్శి మందుల రాజీవ్ తెలిపారు.

ఎనిమిదవ రౌండ్లో టాప్-1 బోర్డులో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ కౌత్సవ్ కుండు (6.5 పాయింట్లు) తెల్లపావులతో, ఇంటర్నేషనల్ మాస్టర్ నీలాష్ సాహా (7 పాయింట్లు) నల్లపావులతో పోటీ పడగా దాదాపుగా నాలుగు గంటల పాటు ఆసక్తికరంగా సాగి చివరికి డ్రా (Draw) గా ముగిసింది.దీంతో ఇంటర్నేషనల్ మాస్టర్ నీలాష్ సాహా 7.5/8 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు అని టోర్నమెంట్ కన్వీనర్ షేక్ ఖాసిం, టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనల కుమార్, డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *