Breaking News

సిలికా, క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ చేసి తరలిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సిలికా, క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ చేసి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, మైనింగ్ ప్రక్రియను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పక్కాగా పర్యవేక్షించాలని మైనింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు మైనింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సిలికా, క్వార్ట్జ్ మైనింగ్ పై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిలికా, క్వార్ట్జ్ మైనింగ్ నిర్వహణ పక్కాగా ఉండాలని ఎలాంటి అక్రమాలకు తావు ఉండరాదని పేర్కొన్నారు. సదరు సిలికా క్వార్ట్జ్ మైనింగ్ మినరల్ డీలర్ లైసెన్స్ ప్రాంతాలలో ఎంట్రెన్స్ మరియు ఎగ్జిట్ ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ ఉండాలని, సిలికా తరలించే వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని అలాగే ఎండిఎల్ ఏరియాను జియో ఫెన్సింగ్ ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో సిలికా క్వాడ్జ్ తదితర ఖనిజాలు అక్రమంగా తరలి వెళ్లరాదని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల గుర్తింపు నేపథ్యంలో గత జూన్ నెల నుండి ఆన్లైన్ మినరల్ ఈ – పర్మిట్ సిస్టం (ఓఎంపిఈఎస్) ను రాష్ట్ర గనుల శాఖ బ్లాక్ చేయడం జరిగిందని, జిల్లాలో 80 సిలికా లీజులు ఉన్నాయని 15 క్వార్ట్జ్ మరియు అసోసియేటివ్ మినరల్స్ లీజులు ఉన్నాయని కలెక్టర్ కు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి నివేదికల ఆధారంగా ప్రధాన కార్యాలయం వారు మూడు కేటగిరీలుగా మేజర్, మైనర్, నో వయోలేషన్ అనే మూడు క్యాటగిరిలుగా విభజించారని తెలుపుతూ అందులో మైనర్ వయోలేషన్ వాటికి పెనాల్టీ విధించి పునరుద్ధరణ చేయడం జరుగుతుందని, అలాగే ఎలాంటి అక్రమాలు లేనటువంటి వాటి లీజులు రిలీజ్ చేయడం కేస్ బై కేస్ చేయడం జరుగుతుందని వివరించారు. అలాగే జిల్లాలో 399 మినరల్ డీలర్ లైసెన్స్ ఏరియాలో ఉన్నాయని వారు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్ మరియు గూడూరు డివిజనల్ గనుల శాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *