విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరి క్లబ్ ఆఫ్ విజయవాడ 3020 ఆధ్వర్యంలో కృష్ణలంక నందుగల ఎ.పి.యస్.ఆర్.యమ్.సి ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఉచిత కంటి శిభిరాన్ని ముఖ్య అతిథి డి.చంద్ర శేఖర్, ఆడిషినల్ కమీషనర్ (ప్రాజెక్ట్స్), విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 3020 “దృశ్యం ఐ కేర్ ప్రాజెక్ట్” ద్వారా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కంటి పరీక్షలతో పాటుగా ఉచితంగా కళ్ళజోడు ను అందించే బృహత్తర కార్యక్రమం ప్రారంబించినందుకు సంస్థ లోని ప్రతీ వారికి పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. విద్యారులు అందరూ తప్పక కంటి పరీక్షలు చేపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం డాక్టర్ వి.శ్రీదేవి ప్రసాద్, ఆధ్యక్ష్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికి కళ్ళు అత్యంత ముఖ్యమైన అవయవం అని అదే విద్యార్థికి కంటి చూపు సరిగా లేనప్పుడు అది తన చదువుపై పడుతుందని తద్వారా తన కెరీర్ అనుకున్న స్థాయికి చేరుకోలేక పోవడం జరుగుతుందని కావున దానిని అదిగమించడానికి “దృశ్యం ఐ కేర్ ప్రాజెక్ట్’ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి మ్యాక్సివిజన్ ఆసుపత్రి వారు తమ సహకారాన్ని అందిస్తున్నారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలను ఆమె తెలియజేశారు.
అనంతరం శ్రీమతి జి.రశ్మి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్,రోటరి క్లబ్ ఆఫ్ విజయవాడ 3020 మాట్లాడుతూ వి.యమ్.సి పరిధిలోని 29 ఉన్నత పాఠశాలలు, రొండు జిల్లాపరిషత్ పాఠశాలలు మొత్తం 31 స్కూలులోని విధ్యారులకు కంటి పరీక్షలతో పాటుగా దృష్టిలోపం ఉన్న వారికి ఉచితంగా కళ్ళజోడును అందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ నెల చివరికల్లా పూర్తిచేయాలని ప్రణాలికను తయారు చేసామని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమానికి రోటీరియన్స్ డాక్టర్ లీలా ప్రసాద్, డాక్టర్ పట్టాభి రామయ్య, రామ కృష్ణప్రసాద్, సిల్వస్టార్, హిలీ, నాగభూషనం, తిలక్, ప్రధాన ఉపాధ్యాయులు యస్.రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది. మ్యాక్స్ విజన్ ఆసుపత్రి నుండి మునేశ్వర్, పాషా, రవి రాజ్, రాజేశ్వరి పాల్గొన్నారు.