-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో సంయుక్త పరిశీలన చేస్తేనే ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. శాఖధిపతుల సమన్వయంతో ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేయడం వల్ల వ్యర్ధాలు, సి అండ్ డి వేస్ట్, తొలగించుట, త్రాగునీటి పైప్లైన్ల మరమ్మతులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు సత్వరమే పరిష్కరించవచ్చని అన్నారు. అలాగే ప్రతి సచివాలయం పరిధిలో కూడా పట్టణ ప్రణాళిక సానిటరీ మరియు ఎమినిటీస్ సెక్రటరీలు ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేసి ప్రజల సమస్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.