మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నైపుణ్య గణనకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులతో శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నిర్వహించు నైపుణ్య గణనపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్య గణన తొలుత పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో నిర్వహించారని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని, అక్కడ నైపుణ్య గణనలో పనిచేసిన వారు మాస్టర్ ట్రైనర్లుగా జిల్లాలో మండల స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈనెల 29న మండల స్థాయిలో శిక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి డేటా సేకరించి, వారికి ఏ ఏ అర్హతలు ఉన్నాయి, ఏ శిక్షణ ఇస్తే వారికి ఉపాధి లభిస్తుందో ఆ విధంగా వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ఇందుకోసం మొబైల్ యాప్ డిజైన్ చేశారని, దీని అనుసరించి డేటా సేకరించవలసి ఉంటుందన్నారు. సేకరించిన డేటా విశ్లేషించి ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ ఈ కార్యక్రమం అమలు నోడల్ అధికారిగా ఉంటారని, ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని, పటిష్టవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరేష్ కుమార్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ రవికాంత్ పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం
-నాకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదు… ప్రజలు నమ్మకంతో గెలిపించారు -వాట్సాప్ ద్వారా త్వరలో 150 సేవలు అందుబాటులోకి -వాట్సాప్ …