-సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని ఐసిడిఎస్ ప్రోజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ రూరల్ మరియు అర్బన్ ప్రోజెక్టుల సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి లు ప్రకటనలో కోరారు.
జిల్లాలోని విజయవాడ (రూరల్) ప్రాజెక్ట్ పరిధిలో రాయనపాడు 3 నందు ఎస్సీ కేటగిరి, 11వ డివిజన్ జార్జీపేట అంగన్వాడీ కేంద్రాల నందు ఓసి కేటగిరిలో అంగన్వాడీ కార్యకర్త పోస్టులను 5వ డివిజన్ వరలక్ష్మి నగర్ మినీ అంగన్వాడీ కేంద్రం నందు ఓసి కేటగిరిలో మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టును, నున్న-10, రామవరప్పాడు-9 అంగన్వాడీ కేంద్రాలలో ఎస్సీ కేటగిరి నందు, రామవరప్పాడు-5, 16వ డివిజన్ మధుసూధన నగర్, గుణదల -4 అంగన్వాడీ కేంద్రాల నందు ఓసి కేటగిరిలోను, 22వ డివిజన్ బ్రమరాంబపురం అంగన్వాడీ కేంద్రం నందు బీసీ-డి కేటగిరిలో అంగన్వాడీ సహాయకురాలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు రూరల్ ప్రాజెక్ట్ సీడీపీవో జి. మంగమ్మ తెలిపారు.
విజయవాడ అర్బన్ పరిధిలోని 35వ డివిజన్ పేజొనిపేట-3 నందు ఎస్సీ కేటగిరీలో, 38వ డివిజన్ గుప్తా సెంటర్ నందు బీసీ-బి కేటగిరీలో, 40వ డివిజన్ నులకపేట-2 నందు ఓసీ కేటగిరిలో, 43వ డివిజన్ యు.ఎస్.నగర్-4 నందు ఓసి కేటగిరిలో, 44వ డివిజన్ పేర్రాజు చెరువు-2 నందు ఓసి కేటగిరిలో, 55వ డివిజన్ వించిపేట-6 నందు బీసీ-ఈ కేటగిరిలో, 24వ డివిజన్ కస్తూరిబాయిపేట నందు ఎస్సీ కేటగిరిలో, 25వ డివిజన్ కొత్త వంతెన-2 నందు ఓసి కేటగిరిలో, 32వ డివిజన్ ఆర్. ఎల్ పేట-1 నందు ఓసీ కేటగిరిలో, 32వ డివిజన్ ఆర్. ఎల్ పీట-2 నందు ఎస్సీ కేటగిరిలో, 36వ డివిజన్ వేంకటేశ్వర మన్యం నందు ఓసి కేటగిరిలో, 58వ డివిజన్ సింగ్ నగర్-9 నందు ఓసి కేటగిరిలో, 58వ డివిజన్ అజిత్ సింగ్ నగర్-12 నందు బిసి-బి కేటగిరిలో, 59వ డివిజన్ లూనా సెంటర్- 3 నందు బీసీ-ఎ కేటగిరిలో, 59వ డివిజన్ ఎస్.సీ ఎస్.టి కాలనీ నందు ఎస్టీ కేటగిరిలో, 60వ డివిజన్ వాంబే కాలనీ-1 నందు బిసి-ఏ కేటగిరిలో, 60వ డివిజన్ వాంబే కాలనీ-15 నందు ఓసి కేటగిరిలో, 60వ డివిజన్ వాంబే కాలనీ-16 నందు ఓసి కేటగిరిలో, 60వ డివిజన్ వాంబే కాలనీ-20 నందు ఓసి కేటగిరిలో, 63వ డివిజన్ రాజీవ్ నగర్ 7 నందు ఓసీ ఆర్ధికంగా బలహీన వర్గం కేటగిరిలో అంగన్వాడి సహాయకురాలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు అర్బన్ ప్రాజెక్ట్ సిడిపివో టి. నాగమణి తెలిపారు.
అంగన్వాడి కేంద్రాలలో పైన తెలిపిన అంగన్వాడి సహాయకురాలు పోస్టులకు జులై 1, 2020 నాటికి 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక వివాహితరాలు అర్హులన్నారు. అర్హత గల అభ్యర్థినులు అంగన్వాడి ఆయా పోస్టుల కొరకు కుల ధృవీకరణ, నివాస దృవీకరణ పత్రాలు, ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ లను దరఖాస్తు ఫారమ్ తో జత చేసి నవంబర్ 5వ తేది సాయంత్రం 5 గంటల లోపు కానూరు నందు గల సి.డి.పి.ఓ. విజయవాడ రూరల్ అర్బన్ కార్యాలయం నందు వ్యక్తిగతముగా అందజేయాలని సి.డి.పి.ఓ లు జి. మంగమ్మ, టి. నాగమణి లు ఆ ప్రకటనలో తెలిపారు.