Breaking News

పర్యాటక రంగంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెడతాం

-బ్రిడ్జి లంక లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
-2025 ఏప్రిల్ నుంచి నూతన టూరిజం అభివృద్ధి కార్యక్రమాలు
-చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తాం
-తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టూడియో ఈ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యండి
-పర్యటక శాఖ మంత్రి కందులు దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సాంస్కృతిక రాజధాని కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని, అందుతో పాటుగా రాష్ట్రంలో పర్యాటకం, సంస్కృతిని, సినిమాటోగ్రఫి రంగాలను సమ్మిళితం చేసి సమగ్ర అభివృద్ధిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

ఆదివారం ఉదయం రాజమండ్రి వద్ద గోదావరి నదిలో బ్రిడ్జి లంక లో “ఆహ్వానం కిచెన్” ఫ్రాంచేజిస్ ఆధ్వర్యంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు కలుగ చేసేందుకు, త్వరలోనే హేవలాక్ బ్రిడ్జి సమీపంలోని గోదావరి తీరంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆ క్రమంలో రానున్న గోదావరి పుష్కరాలు నేపథ్యంలో గోదావరి తీరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఏదైనా ఒక ప్రాంతానికి పర్యాటకులు వస్తే కనీసం స రెండు మూడు రోజుల పాటు ఉండేలా వసతులు కల్పిస్తామని, అందుకు ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యం తో అడుగులు వేయడం జరుగు తుందన్నారు. ఒక లక్ష రూపాయల పెట్టుబడి తో టూరిజం సర్క్యూట్ ల కనీసం 8 నుంచి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తామని మంత్రి వెల్లడించారు.

కేబినెట్ సబ్ కమిటీ లోని దేవదాయ శాఖ, అటవీశాఖ, వైద్య, పర్యాటక శాఖలతో కలిసి రాష్ట్రంలో ఎకో, అడ్వేంచర్, వెల్ నెస్, టెంపుల్ టూరిజంలను అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

అందాలొలికే గోదావరి లో బ్రిడ్జి లంక లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ప్రారంభించడం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఒకవైపు అందమైన గోదావరి నది, మరోవైపు నర్సరీలు ఆ మధ్యన ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో భోజనం చేయడం ప్రతి ఒక్కరూ మధురానుభూతి ని కలుగ చేస్తుందని మంత్రి తెలిపారు. ఎటువంటి అసాంఘిక కార్యకలపాలకు తావులేకుండా చూడాలన్నారు. ఆహ్వానం కిచెన్ ప్రాంచేజీస్ దేశీయంగా మహానగరాల్లో ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లోటింగ్ రెస్టారెంట్ విజయవంతంగా కొనసాగాలన్నారు. నిబంధనలు పాటించి పది కాలాల పాటు విజయవంతంగా నిర్వహించడంలో నిబద్ధతతో ఉండాలని మంత్రి నిర్వాహకులకి శుభాశీస్సులు అందజేశారు.

రాబోయే ఐదేళ్ల కాలానికి పర్యాటక రంగంలో అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. కేరళ కంటే అందమైన ప్రదేశాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందకపోవడం శోచనీయమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న సహజమైన ప్రకృతి అందాలతో ఇతర రాష్ట్రాలకన్నా పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తద్వారా ఆదాయం పెంపొందించే మార్గాలను అన్వేషిస్తామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పర్యటక రంగాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా రావడం శుభ పరిణామమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ రాష్ట్రానికి తద్వారా పర్యాటక రంగంలో విస్తృతంగా పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అభిప్రాయపడ్డారు. పిపిపి విధానంలో పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టూరిజం బోర్డ్, అధికారులు అందరం ఐకమత్యంగా పనిచేసి టూరిజంను అభివృద్ధి చేస్తామని మంత్రి ఉధ్గాటించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరిగే కొద్దీ ఉపాధి కూడా అంతకి పదిఇంతలు స్థాయిలో పెరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం జరిగి చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని కాంక్షించారు. చిత్ర పరిశ్రమకు విశాఖపట్నం అన్ని విధాల అనుకూల ప్రాంతమని తెలుపుతూ స్టూడియోల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఏ. పద్మవతి , జనరల్ మేనేజర్ రాజారామ్ , శాసన సభ్యులు బత్తుల బలరామ కృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాసు, రాష్ట్ర టూరిజం బోర్డ్ సభ్యులు వాసిరెడ్డి రాంబాబు, టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి స్వామి నాయుడు, జిల్లా టూరిజం అధికారి పి. వెంకటచలం, “ఆహ్వానం కిచెన్ ప్రాంచేజిస్” ప్రతినిధి శ్రీనివాస్, కూటమి ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *