-గ్రామంలో దళితవాడల్లో, ఇతర ప్రాంతాలలో సుమారు ఒకటిన్నర కిలో మీటర్ల మేర పర్యటన
-ఐదుగురు గ్రామస్థులతో కలిసి కంపెనీ లో ఇధనాయాల్ తయారు ప్రక్రియని పరిశీలించిన అధికారులు
-అస్సాగో కంపెనీ వల్ల ఎదురవుతున్న సమస్యలను గ్రామస్తులతో నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది
-సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశాం
-వారం రోజులపాటు గుమ్మాళ్ళ దొడ్డి గ్రామంలో పర్యటించి , జల, శబ్ద, వాయు కాలుష్యాల పరిస్థితులపై నివేదిక తయారు చేస్తారు
-తప్పనిసరిగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం –
-కలెక్టర్ పి ప్రశాంతి
గోకవరం (గుమ్మళ్ల దొడ్డి), నేటి పత్రిక ప్రజావార్త :
అస్సాగో ఇథనాయల్ పరిశ్రమ వలన గుమ్మాళ్ల దొడ్డి, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులూ క్షేత్ర స్థాయిలో వాస్తవంగా తెలుసుకునేందుకు, ప్రజల సమస్యలను నేరుగా వారీ నుంచి తెలుసు కునేందుకు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం గోకవరం మండలం గుమ్మాళ్లదొడ్డి గ్రామంలో కలక్టర్ , సమన్వయ శాఖల అధికారులు, గ్రామస్థులతో కలిసి కలెక్టర్ పర్యటించడం జరిగింది. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి సంభాషించి సమస్య వివరాలు తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, అస్సాగో ఇథ నాయల్ పరిశ్రమ ను గ్రామస్థుల సమక్షంలో ఆధికారుల బృందం సంయుక్తంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆమేరకు అధికారులతో కలిసి గ్రామస్తులు తరపున ప్రతినిధుల బృందం ముందుకు రావాలని కోరారు. పరిశ్రమలు, పర్యావరణ, రెవెన్యు, ఎపి ఐ ఐ సి లతో కూడిన అధికారులు బృందం గ్రామస్తులతో కూడి సంయుక్తంగా ప్రొడక్షన్ తయారు చేసే విధానం ను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. పర్యావరణ శాఖ అధ్వర్యంలో వారం రోజులు పాటు అధికారులు ఇక్కడే ఉండి కంపెనీ నుంచి విడుదల అయ్యే జల, శబ్ద, వాయు కాలుష్యాల పరిస్థితులపై నివేదిక తయారు చేస్తారని పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు కలక్టర్ హామీ ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, ఈ విషయంలో గ్రామస్థుల సమక్షంలో పరిశీలన కోసం అధికారులకి దిశా నిర్దేశనం చెయ్యడం జరిగిందని కలక్టర్ గ్రామస్థులకు వివరించారు.
సమస్య పరిష్కారం కోసం అధికారుల బృందంలో పరిశ్రమల సహాయ సంచాలకులు పి ప్రదీప్ కుమార్, ఫ్యాక్టరీస్ తనిఖీ విభాగం తరపున డిప్యూటి చీఫ్ ఇంజనీర్ ఆర్. త్రినాథ్, శేఖర్, జిల్లా అధికారి జి. స్వాతి, పర్యావరణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకర రావు లు అధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంపెనీ లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కోసం గ్రామస్థులు చందాసి చిన్న బాబు, బులా అబ్బులు, రెడ్డి నారాయణ, పెద్ది నాగలక్ష్మి , ఏ. కృష్ణ ప్రసాద్ హజరు కాగా, అస్సాగో ప్లాంట్ ఇన్చార్జి వి. కే. శుక్లా , జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) శివరామ్ లు ఉత్పత్తి అయ్యే విధానాన్ని వివరించారు. ప్రస్తుతం బియ్యం నూకలను ఉపయోగించి మాత్రమే ఇధనాయల్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఆపరేషన్ తీరును, విడుదల అయ్యే వాయు , శబ్ద కాలుష్య తదితర అంశాలను గ్రామస్థులకు వివరించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ , అదనపు ఎస్పి ఏ వి సుబ్బరాజు, ఇన్చార్జి డిఎస్పీ దేవ కుమార్, సహాయ సంచాలకులు పి ప్రదీప్ కుమార్, ఫ్యాక్టరీస్ తనిఖీ విభాగం తరపున డిప్యూటి చీఫ్ ఇంజనీర్ ఆర్. త్రినాథ్, శేఖర్, జిల్లా అధికారి జి. స్వాతి, పర్యావరణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకర రావు లు గ్రామస్థులు చందాసి చిన్న బాబు, బులా అబ్బులు, రెడ్డి నారాయణ, పెద్ది నాగలక్ష్మి , ఏ. కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.