Breaking News

ఆర్థిక రాజ‌ధాని వైజాగ్ క్రీడ‌ల్లో కూడా ముందుండాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఎ.యు లో శ్రీరామనేని కోదండరామయ్య క్రీడా భవనం ప్రారంభం

-అథ్లేట్ జ్యోతి ఎర్రాజీ ను స‌న్మానించిన ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎంపి శ్రీభ‌ర‌త్

వైజాగ్ , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఆర్థిక రాజ‌ధాని వైజాగ్ అన్నిరంగాల్లోకి విస్త‌రిస్తుంది. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు కావాల్సిన అన్ని స‌దుపాయాలు, సౌక‌ర్యాలు అందుబాటులో వున్నాయి. వైజాగ్ క్రీడ‌ల్లో కూడా ముందుండాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు. వైజాగ్ లోని ఆంధ్రా యూనివ‌ర్శిటీలో సోమ‌వారం జ‌రిగిన శ్రీరామ‌నేని కోదండ‌రామ‌య్య క్రీడాభ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎంపి శ్రీభ‌ర‌త్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు, పీజీవీఆర్ నాయుడు (గ‌ణ‌బాబు) ల‌తో క‌లిసి పాల్గొన్నారు. వీరంతా ముందుగా కోదండ రామ‌య్య విగ్ర‌హానికి పూలు స‌మ‌ర్పించి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో విశాఖ నుంచి ఒలింపిక్స్‌కు తొలి అథ్లెట్‌గా ఎంపికైన జ్యోతి ఎర్రాజీ ను ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎంపి శ్రీభ‌ర‌త్ ఘ‌నంగా స‌న్మానించారు. జ్యోతి ఎర్రాజీ రూ.5ల‌క్ష‌ల చెక్క్ ను సీర‌మ‌నేని శ్రీనివాస‌రావు,నేదుర‌మ‌ల్లి గౌతం రెడ్డి అంద‌జేశారు. అనంతరం ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో క్రీడలకు గుర్తింపు తెచ్చి , వాలీబాల్ సహా అన్ని క్రీడల అభివృద్ధికి విశేష కృషి చేసిన కోదండ రామయ్య అందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయార‌ని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. శ్రీరామ‌నేని కోదండ రామ‌య్యగా కాకుండా వాలీబాల్ కోదండ రామ‌య్య‌గా ప్రాచుర్యం సంపాదించుకున్నాడ‌న్నారు. వాలీబాల్ రంగంలో ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దిన కోదండరామయ్య విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని శ‌న‌గ‌పాడుకి చెందిన వ్య‌క్తి కావ‌టం తమకెంతో గర్వకారణం అన్నారు. . అలాగే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం త‌న‌కి ద‌క్కిన అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వైజాగ్ లో ఎంతో మంది క్రీడాకారులు కోదండ రామ‌య్య శిక్ష‌ణ ఇచ్చి వారు ద్రోణ‌చార్య, అర్జున్ అవార్డులు అందుకునేలా త‌యారు చేశారని గుర్తు చేశారు. ఆయ‌న ఆశ‌యాలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌, క్రీడా శిక్ష‌ణ ఎంతోమందిలో క్రీడా స్పూర్తి ర‌గిలించింద‌న్నారు. కొదండ రామ‌య్య వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించే విధంగా ఆయ‌న పేరున స్పోర్ట్స్ విభాగానికి భవనం నిర్మించి అందించిన కొదండ రామ‌య్య కుమారుడు శ్రీధర్ తో పాటుగా కుటంబ స‌భ్యుల్ని అభినందించారు. కార్యక్రమంలో ఏ.యూ విసి ఆచార్య జి.శశిభూషణరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయ రావు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్,ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ. నరసింహ రావు,శ్రీ రామనేని కోదండ రామయ్య సోదరుడు ఏ పి ఓలింపిక్ అసోసియేషయిన్ మెంబెర్ శ్రీరామనేని రామలింగ ప్రసాద్,క్రీడా విభాగాధిపతి ఆచార్య పల్లవి, సంచాలకులు ఆచార్య ఎన్. విజయ మోహన్, విశ్రాంత ప్రిన్సిపల్ ఆచార్య బి ప్రసాదరావు, ఎడ్యుకేషన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ షారోన్ రాజు,కోదండరామయ్య కుటుంబ సభ్యులు, అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, కోదండ రామయ్య శిష్యులు, ఓలింపిక్ విశాఖ సెక్రటరీ కే సూర్యనారాయణ, ఓలింపిన్ మాణిక్యాలు నాగేశ్వరరావు అభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *