Breaking News

రూ.2.50 ల‌క్ష‌ల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అంద‌జేత‌ కుటుంబ స‌భ్యుల‌కి అంద‌జేసిన ఎంపి కార్యాల‌య సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద రోగుల‌కి వైద్య విష‌యంలో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌కూడ‌ద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) త‌ను వైజాగ్ లో వుండ‌టంతో..సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2.50 ల‌క్ష‌ల లెట‌ర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) లెట‌ర్ ను సోమ‌వారం త‌న కార్యాల‌యంలో ఇచ్చే ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఎ.కొండూరు మండ‌లం గొల్ల‌మంద్ల గ్రామానికి చెందిన న‌ల్లిబోయిన లక్ష్మీ కి బ్రెయిన్ స‌ర్జ‌రీకి అవ‌స‌ర‌మైన వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2.50 ల‌క్ష‌ల ఎల్.వో.సి లేట‌ర్ ను న‌ల్లిబోయిన ల‌క్ష్మీ భ‌ర్త న‌ల్లిబోయిన శ్రీనివాస‌రావు కి ఎంపి కార్యాల‌య సిబ్బంది అంద‌జేశారు.. హైద‌రాబాద్ య‌శోదా హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్న త‌న భార్య ల‌క్ష్మీ వైద్యానికి సీఎంఆర్ ఎఫ్ ద్వారా సాయం అందించినందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ కి, ఎంపి కార్యాల‌య సిబ్బందికి న‌ల్లిబోయిన శ్రీనివాస‌రావు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముల్పూరి కిషోర్, బాలినేని మోహ‌న్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *