తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇటీవల కాలంలో బాలలుపై జరుగుతున్న ఆన్ లైన్ మోసాలు,వేధింపులు మరియు సైబర్ నేరాల పై ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారి నేతృత్వంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక రోజు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఇటీవల కాలంలో కొంతమంది బాలలు ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కొని వాటిని సరఫరా చేస్తూ చెడు స్నేహాలు కు, దురలవాట్లుకు బానిసై తమ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకుంటున్నారని మరియు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తిరుపతి ,విజయవాడ మరియు విశాఖ పట్నంలో ఇటువంటి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించడము జరిగిందనీ అందులో భాగంగా తిరుపతి లో భిమాస్ హోటల్ లో ఈ సదస్సును రేపు ( 29-10-2024) నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు చైర్మన్ అప్పారావు తో పాటు కమిషన్ సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్ , రాయలసీమ ప్రాంతానికి మరియు నెల్లూరు జిల్లా కు సంబంధించిన జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షులు ,మిషన్ వాత్సల్య అధికారులు మరియు శ్రీబాలాజీ తిరుపతి జిల్లాకు చెందిన సైబర్ నేరాల పర్యవేక్షణ చేస్తున్న పోలీసు సిబ్బంది ,స్థానిక స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, పాల్గొంటారని తద్వారా రూపొందించబడిన విషయాలను నివేదిక రూపంలో తదుపరి చర్యలు కు ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు
Tags tirupati
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …