విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెప్మా వారి ఆధ్వర్యం లో జరిగిన ప్రైస్ అవార్డ్స్ 2023-24 పురస్కారాలలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ చేతులు మీద ప్రైస్ అవార్డు ను విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ ధ్యాన చంద్ర మంగళవారం ఉదయం తుమళ్లపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో మెగా అండ్ మిలియన్ ప్లస్ సిటీస్ కేటగిరీ లో విజయవాడ నగరపాలక సంస్థ కు ఈ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నేషనల్ అర్బన్ లైవలిహుడ్ మిషన్ లో భాగం గా, ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నీధి (PMSVA Nidhi) ద్వారా వీధి విక్రయదారులకు రుణ సదుపాయామ్ కల్పించినందున విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ ధ్యాన చంద్ర ఈ PRAISE ( పెర్ఫార్మనాస్ రికగ్నిసిషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లూషన్ అండ్ స్ట్రీట్ వెండార్స్ ఎంపవర్మెంట్) అవార్డు ను అందుకున్నారు.
ఈ సందర్బంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ సపోర్ట్ టు అర్బన్ స్ట్రీట్ వెండార్స్ (SUSV) వీధి వ్యాపారస్థుల యాక్ట్ 2014 ద్వారా 17114 వీధి వ్యాపారస్థులను గుర్తించారని, అందులో వారు సమర్పించిన గుర్తింపు కార్డ్స్ ల ఆధారంగా 16771 కు వీధి వ్యాపారస్థుల గుర్తింపు కార్డ్లను ఇచ్చారని, ఇంకా 343 వారికీ సరైన గుర్తింపు కార్డ్స్ ల ఆధారంగా వారికి కూడా వీధి వ్యాపారస్థుల గుర్తింపు కార్డ్లను ఇవ్వనున్నారని, అందులో 9428 అర్హులైన వీధి వ్యాపారస్థులలో 9200 వీధి వ్యాపారస్థులకు PMSVA Nidhi పధకం, 6748 ఇతర రుణ సదుపాయం కల్పించారని, మొత్తం 16203 వీధి వ్యాపారస్థులకు, దాదాపు 97% వారికి రుణ సదుపాయం కల్పించారాని అన్నారు. మిగిలిన వారికి కూడా త్వరతీగతిన రుణ సదుపాయం కల్పిస్తున్నాం అని కమిషనర్ అన్నారు. పేదరిక నిర్మూలనకు ఆంధ్ర రాష్ట్ర కేంద్ర సహకారాలతో విజయవాడ నగర పరిధిలో అర్హులైన అందరికీ విజయవాడ నగరపాలక సంస్థ తోడు ఉంటుందని అన్నారు.