విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా సమయంలో రక్తం దొరక్క ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని హోరేబు ప్రార్థనా మందిరం నందు రాధమ్మ వెల్ నెస్ సెంటర్ లవ్ ఇన్ యాక్షన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మరణించిన పెద్దల పేరిట సేవా కార్యక్రమాలు, యువతలో మానసికోల్లాసాన్ని పెంపొందించేలా క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా కారణంగా గతంలో కంటే ప్రస్తుతం రక్తం యొక్క అవసరం అధికంగా ఉందన్నారు. ఇటువంటి సమయంలో రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాధమ్మ వెల్ నెస్ సెంటర్ లవ్ ఇన్ యాక్షన్ ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఇద్దరు అనాథ బాలురకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది. తదనంతరం కబడ్డీ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి యర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, నాయకులు జిల్లెల్ల శివ, కొక్కిలిగడ్డ నాని, మేడ రమేష్, ఎస్.కే.ఇస్మాయిల్, జేడీ కృపా, చిన్నారి విమల, ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అన్నపురెడ్డి జోజిబాబు, పాస్టర్ వంగూరి ఐజక్ రాజు, కోట కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …