Breaking News

కరోనా వ్యాప్తి నియంత్రణలో ఫీవర్ సర్వే కీలక పాత్ర… : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను  తెలిపారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలోని 14 వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని కోవిడ్ రహిత ప్రాంతంగా చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి, వైరస్‌ బారిన పడిన వారిని తక్షణం గుర్తించడానికి ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యలు కరోనాను కట్టడి చేయడానికి ఉపకరించాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోకి పాలనను చేరువ చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్ గారు తీసుకువచ్చిన పాలనాపరమైన మార్పులు కూడా సంక్షోభ సమయంలో ప్రజలకు సత్వర సేవలందించేందుకు కారణమయ్యాయని తెలిపారు. ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయంను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సచివాలయాల పరిధిలో ఫీవర్ క్లీనిక్స్‌ను ప్రారంభించిన ప్రభుత్వం కరోనా విపత్తులో ఇంటింటి సర్వేలను విజయవంతంగా నిర్వహించిందని, కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వేలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *