విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పురోహితుల సమస్యల పరిష్కారం కోసం సాంబమూర్తి రోడ్ ధర్నాచౌక్ నందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సమాఖ్య సభ్యులు పలు సమస్యలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని విన్నవించారు. వీటితో పాటు పింఛన్, హెల్త్ కార్డుల సదుపాయం సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ గౌరవ శాసనసభ్యులకు వినతిపత్రాన్ని అందజేశారు. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించడం ద్వారా తమకు భద్రత, భరోసా లభిస్తుందని.. అన్ని సంక్షేమ పథకాలకి అర్హులు అవుతామని విన్నవించారు. స్పందించిన చైర్మన్ గారు రాష్ట్రంలోని పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. అర్చకుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పడంతో.. సమాఖ్య సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారిని కలిసిన వారిలో యామజాల నరసింహమూర్తి, విధ్యాదర శాస్త్రి, సునీల్ శర్మ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …