Breaking News

సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు లబ్ధిదారులను చైతన్యపరచాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచడమే సచివాలయ సిబ్బంది ప్రథమ కర్తవ్యమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. 63వ డివిజన్ లోని 276, 277 సచివాలయాల సిబ్బందిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో..  శాసనసభ్యులు ఆయా సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శుల హాజరుపట్టి, రికార్డులు, ప్రజల అర్జీలను పరిశీలించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అటువంటి వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా పనిచేయాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సేవలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా సచివాలయ సిబ్బంది కారణంగా ఇబ్బందులకు గురికాకూడదన్నారు. సర్వర్ మొరాయింపు, ఈకేవైసీ పడని కారణంగా డివిజన్ లో ఏఒక్కరికీ రేషన్ పంపిణీ నిలిచిపోకూడదన్నారు. కార్యదర్శులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే  వెంట డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్, సీహెచ్ రవి, మెండు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *