-జెసి శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలోను మరియు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖామాత్యులు నారా లోకేష్ సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోని 15 నుండి 59 వయస్సు మద్య గల వ్యక్తులకు సంబందించిన విధ్యా అర్హతలు, ఉద్యోగ అనుభవం మరియు వారి మేరుగైన ఉద్యోగ ఆసక్తులను సేకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన బృహత్తర స్కిల్ సెన్సెస్ సర్వే.
ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి మరియు తాటికొండ నియోజక వర్గంలోని తుళ్ళూరు మండలం పరిధిలో స్కిల్ సెన్సెస్ సర్వేను పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి పూర్తి చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న స్కిల్ సెన్సెస్ సర్వేలో భాగంగా ఈ రోజు కలెక్టర్ సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ స్కిల్ సెన్సెస్ సర్వే క్వాలిటీ గా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలిసి జాగ్రత్తగా సర్వే చేయాలని ఏ చిన్న తప్పిదం జరగకుండా చూడాలని మన జిల్లా బెస్ట్ క్వాలిటీ సర్వే జరగాలని ఈ సందర్భంగా అందరికి తెలియజేశారు.
నేటి బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండలం లోని ఎంపీడీవో ఆఫీసులో ఉన్న ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఎంపీడీవో తరఫున సెక్రటేరియట్ లోని(GSW Dept. )ఒక డిజిటల్ అసిస్టెంట్ మరియు ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ రోజు శిక్షణా కార్యక్రమానికి పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి, వెంకటరమణ, సుశీల దేవి, డిపిఓ మరియు జిల్లా జి ఎస్డబ్ల్యూ ఆఫీసర్, అలాగే గూడూరు, శ్రీ కాళహస్తి , సులూరుపేట డిఎల్డివోస్ విచ్చేసి వారి అమూల్యమైన సూచన, సలహాలు ఇవ్వడం జరిగింది. ఎన్ శ్యామ్మోహన్, రాయలసీమ పర్యవేక్షణ అధికారి, ఏపీ ఎస్ ఎస్ డి సి, వెంకట్రావు, మాస్టర్ ట్రైనరు, మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి,ఆర్. లోకనాథం గారు సర్వే చేపట్టబోయె ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఎర్పాటు చేసి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
నిన్న కలెక్టర్ జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీలకు, అలాగే జిల్లా అధికారులకు, జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో స్కిల్ సెన్సస్ గురించి తెలపడం కూడా జరిగింది. అలాగే ఇన్చార్జి మంత్రి కూడా ముఖ్యమంత్రి, తొలి 5 సంతకాల్లో భాగంగా స్కిల్ సెన్సెస్ ఫైలుపై సంతకం అంశం గురించి వివరించారు.
స్కిల్ సెన్సెస్ సర్వేకు సంబందించి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (APSSDC – DSDO), జిల్లా ఉపాధి కల్పన అధికారి (DEO),CEO ZPP,DPO, PD DRDA,PD MEPMA, GSWO,DLDO’s మరియు స్కిల్ సెన్సస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లు కో ఆర్డినేటర్స్ గాను మండల పరిదిలో MPDO గారు పట్టణ ప్రాంతం మండలాల్లో మున్సిపల్ కమీషనర్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు.
క్షేత్రస్థాయిలో సచివాలయాన్ని యూనిట్ గా తీసుకుని సదరు సచివాలయ జనావాసాలను క్లస్టర్ గా విభజించుకుని ఒక్కో క్లస్టర్ కి ఒక ఎన్యుమరేటర్ ను నియమించుట ద్వారా సర్వే నిర్వహించబడుతుంది. ప్రతి ఎన్యుమరేటర్కు నిర్దిష్ట కుటుంబాలను మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం సర్వే కార్యక్రమాన్ని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్ లోకనాథం, (APSSDC – DSDO), నిరంతరం పర్యవేక్షిస్తారు.
జిల్లాలో యువతలోనున్న నైపుణ్యాలను గుర్తించి వారికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిని అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్న మానవ వనరులకు మరియు పరిశ్రమలకు కావల్సిన అర్హత కలిగిన మానవ వనరులను మధ్య అంతర్యాన్ని తగ్గించే బ్రుహత్తర కార్యక్రమమే ఈ స్కిల్ సెన్సస్ సర్వే. ఈ సర్వే సందర్భంగా సంబందిత ప్రజల వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించడ౦ ద్వారా జిల్లాలోని నైపుణ్యాభివృద్ధిని కొనసాగించడంలో ప్రజలందరు సహకరించవలసిందిగా కోరడమైనది.
ఈ కార్యక్రమానికి 33 మండలాల నుంచి ఒకొక్క మండలం నుంచి ముగ్గురు సిబ్బంది చొప్పున అలాగే మున్సిపాలిటీస్ 7 ఉన్నాయి అందులోంచి ముగ్గురు చొప్పున అలాగే ఏపీ ఎస్ ఎస్ డి సి, ఎంప్లాయిమెంట్ ఆఫీసు సిబ్బంది, సీడ్ఆఫ్ సిబ్బంది తరఫున టోటల్గా 175 మంది సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.