-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో విఎంసి చేపట్టిన పనులలో పురోగతి ఉండాలని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో శాఖాధిపతులతో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం కమిషనర్ నిర్వహించారు, నగరంలో బిఎంసి చేపట్టిన పనులు, ఎంతవరకు పనులు అయ్యాయి, ఇంకా ఏమేం పనులు చేపట్టాల్సిన ఉన్నది, వంటి విషయాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు.
ఇంజనీరింగ్ విభాగం వారు చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని, ఎందులోనూ లోపం లేకుండా చూసుకోవాలని ఇంజనీర్లు అందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. గత కౌన్సిల్లో తీసుకున్న తీర్మానాలపై అధికారులు తీసుకున్న చర్యలు, వాటి పురోగతి అడిగి తెలుసుకున్నారు. ప్రజల కోసం, నగర అభివృద్ధి తీర్మానించిన కౌన్సిల్ ప్రతిపాదనలపై అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సుపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, అసిస్టెంట్ కమిషనర్లు రెవెన్యూ, పాల్గొన్నారు.