Breaking News

జిల్లాలో నైపుణ్య గణన చేపట్టుటకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నైపుణ్య గణన చేపట్టుటకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను విద్యాసంస్థల ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో నైపుణ్య గణన ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో 15 నుంచి 59 సంవత్సరాల వరకు వయసు కలిగి చదువుతున్న విద్యార్థుల నైపుణ్య గణనను చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్క విద్యార్థికి ఈ సమాచారాన్ని తప్పనిసరిగా తెలియజేయాలన్నారు

ఒక షెడ్యూల్ను తయారుచేసి అన్ని ఐటిఐ, ఇంటర్, డిగ్రీ,ఇంజనీరింగ్, విశ్వవిద్యాలయాలు తదితర విద్యాసంస్థలను సందర్శించాలన్నారు. నైపుణ్య ఆప్ లో వారి వివరాలను నమోదు చేయాలన్నారు ఇందుకోసం నోడల్ అధికారులను గుర్తించి వారి పేర్లు హోదా వివరాలను నైపుణ్యాభివృద్ధి అధికారికి అందజేయాలన్నారు. నైపుణ్య గణనపై నోడల్ అధికారులకు, ఫ్యాకల్టీలకు వర్చువల్ గా శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి నరేష్ కుమార్, కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె. శోభన్ బాబు,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సాల్మన్ రాజు, శిక్షణాధికారి వేణుగోపాల్ పలు విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *