-చంద్రబాబును కలిసేందుకు క్యూ కడుతున్న పారిశ్రామికవేత్తలు
-ఓర్వలేక విమర్శలు చేస్తున్న వైసీపీ బురద నేతలు
-గడిచి ఐదేళ్లలో ఉన్న పరిశ్రమలను తరిమికొట్టిన నిచులు ఈ వైసీపీ నేతలు
-నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశే కూటమి ప్రభుత్వం లక్ష్యం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమలు తీసుకురాలేక దొంగ ఎంఓయూలు చేసుకుని.. ఉన్నపరిశ్రమలను కూడా తరిమికొట్టి గత ఐదేళ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిండా ముంచిన ఈ వైసీపీ దద్దమ్మ ప్రభుత్వం.. ఆ పార్టీ బురదనేతలు నేడు ఐటీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వరదలా తరలివస్తుండటంతో చూసి ఈర్షత్యో ఓర్వలేక బురద చల్లేందుకు యత్నిస్తున్నారని.. వారిని నిరుద్యోగులే నిలదీసి తరమికొట్టాలని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డూండి రాకేష్ మాట్లాడుతూ..లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాలనుండి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒక్క పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాలేదు. జగన్ టీమ్ దోచుకోవడం దాచుకోవడం తప్పా.. రాష్ట్రంలో యువత భవిష్యత్ గురించి ఆలోచన చేయలేదు. కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఏనాడు ప్రయత్నించలేదు. పరిశ్రమల ఏర్పాటుకు విదేశాలకు వెళ్లాలంటే చలి అంటూ వణికిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నిరుద్యోగులకోసం మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం ఆపిన కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నాం. అమరావతితో పాటు, విశాఖలో కూడా ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగాలు చేయాలంటే పక్కరాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే పనిలేదు. స్వరాష్ట్రంలో తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు.
జగన్ రెడ్డి ఏదేశానికైనా, ఏరాష్ట్రానికైనా వెళ్లి ఒక్క రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గతంలో మేము అభివృద్ధి చేస్తే జగన్ రెడ్డి అవార్డులు తీసుకున్నాడు. ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీని అగ్రస్థానంలో ఉంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు పాలనలో ఘనంగా ముందుకు వెళ్తోంది. వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. క్రమక్రమంగా వ్యాపారాలు పెరుగుతున్నాయి. అనేక ఉద్యోగాల కల్పనకు కొత్త కొత్త కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఏపీ ఊపిరి పీల్చుకుంటోంది.
భవిష్యత్ తరాల భవిష్యత్ కోసం ఏపీ సిద్ధం అవుతోంది. నారాలోకేష్ అమెరికా పర్యటనకు వెళితే గ్రీన్ కార్పెట్ తో ఎన్నో కంపెనీలు స్వాగతం పలికాయి. పెద్ద పెద్ద కంపెనీలు వేల కోట్లతో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాబోతున్నాయి. ఇది చాలా ఆనందకరమైన విషయం. కొత్తకొత్త టెక్నాలజీతో మంత్రి నారాలోకేష్ సారథ్యంలో అనేక కంపెనీలు ఏపీకి వలసకట్టబోతున్నాయి. గత ప్రభుత్వం అశ్రద్ధ చేసిన పత్రి డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలను ఈ ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్ కోసం రెయి పగలు అని లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాన్, లోకేష్ బాబులు కష్టపడుతున్నారు. వైసీపీ నేతల్లా విశాఖలో దొంగ ఎంఓయూలు చేసుకున్నట్లు మేము చేయడంలేదు.
స్వయంగా విదేశీ వీధుల్లో తిరుగుతూ.. పరిశ్రమలను ఏపీకి తెచ్చేందుకు మంత్రి నారా లోకేష్ కష్టపడుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిరోజు పారిశ్రామికవేత్తలు చంద్రబాబును కలుస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యను పూర్తిగా రూపుమాపబోతున్నాం.. లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. సూపర్ సిక్స్ పథకాల అమలు, పేదలకు సామాజిక న్యాయం చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుంది. లోకేష్, చంద్రబాబు, ఎన్డీఏ కూటమి వైపు మీరు వేలెత్తి చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు మీవైపే చూపిస్తాయి.. మీ గత చరిత్ర ఎంత నీచమో మీరు గుర్తు చేసుకోవాలి. యువత భవిష్యత్ కోసం కూటమి నేతలు శ్రమిస్తుంటే.. దిగజారి మాట్లాడటం సిగ్గుచేటు. గత ఐదు సంవత్సరాల్లో ఏఒక్క పరిశ్రమను కూడా వైసీపీ నేతలు ఎందుకు తీసుకురాలేకపోయారో నిరుద్యోగులు ఆ పార్టీ నేతలను నిలదీయాలి. నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ ఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.